బంగాల్లో ఆరో దశ అసెంబ్లీ పోలింగ్ జరుగుతున్న వేళ.. నాటు బాంబు పేలుడు కలకలం సృష్టించింది. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తర 24 పరగణాలు జిల్లా తితాగఢ్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ పేలుడు జరిగింది.
పేలుడు జరిగిన వెంటనే.. ఘటనాస్థలికి పోలీసు సిబ్బంది, సీఏపీఎఫ్ జవాన్లు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారని అధికారులు తెలిపారు. ప్రాథమిక దర్యాప్తులో.. మాస్కు ధరించిన, గుర్తు తెలియని వ్యక్తులు.. తితాగఢ్లోని టాటా గేట్ వద్ద నాటు బాంబులను విసిరినట్లు తేలిందని వెల్లడించారు.
క్షతగాత్రులను బీఎన్ బోస్ ఆస్పత్రికి తరలించామని అధికారులు చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టామని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: 'నిధులున్నా టీకా ఉచితంగా ఇవ్వరేం?'
ఇదీ చూడండి: ఉగ్ర కుట్ర భగ్నం- పారిపోయిన ముష్కరులు