body massage from women thieves: దొంగతనం వృత్తిలోకి దిగే ప్రతి ఒక్కరికీ ఏదో ఓ కారణం ఉంటుంది. కుటుంబ అవసరాల కోసం గత్యంతరం లేక చోరీలకు పాల్పడేవారు కొందరైతే.. విలాసాలు అనుభవించడానికి దొంగతనాలు చేసే వారు మరికొందరు. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఆ రెండో కోవకు చెందిన దొంగల గురించే.
Karnataka body massage thieves
కర్ణాటకకు చెందిన జాన్ మెల్విన్, మంజునాథ్లు.. తాళాలు వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడతారు. దొరికిందంతా దోచుకుంటారు. వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తారు. ఇందులో ప్రధానంగా ఖర్చు చేసేది మాత్రం మహిళలతో బాడీ మసాజ్ చేయించుకోవడానికే. ఇందుకోసమే వారు దొంగతనాలు మొదలు పెట్టారు.
అయితే, వీరిద్దరినీ బెంగళూరు విజయనగర పోలీసులు అరెస్టు చేశారు. 360 గ్రాముల బంగారం, రూ.16 లక్షల నగదు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో భాగంగా వీరిద్దరూ నేరాన్ని అంగీకరించారని పోలీసులు తెలిపారు.
రూ.వేలల్లో టిప్పు
'స్పాలకు వెళ్లి మహిళలతో బాడీ మసాజ్ చేయించుకోవడం కోసం డబ్బులు సంపాదించాలనే నిందితులు దొంగతనాలు చేశారు. ఈ విషయాన్ని వారు ఒప్పుకున్నారు. బెంగళూరే కాదు తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని మసాజ్ సెంటర్లకు కూడా వీరు వెళ్తారు. రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు టిప్లు కూడా ఇచ్చేవారు' అని డీసీపీ సంజీవా పాటిల్ వివరించారు.
ఇదీ చదవండి: భాజపాలోకి 'ది గ్రేట్ ఖలీ'... మోదీ సర్కారు విధానాలు నచ్చి...