ఉత్తర్ప్రదేశ్ ఘాజీపుర్లోని గంగానదిలో మరోసారి మృతదేహాలు కనిపించాయి. ఈ ఉదయం పెద్ద సంఖ్యలో మృత దేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. ఇటీవలే గంగానదిలో కొవిడ్ మృతదేహాలను ఖననం చేస్తున్నట్లు వార్తలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో నదిలో మృతదేహాలు కనిపించడం పట్ల స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
కొద్దిరోజుల క్రితమే బిహార్ బక్సార్ జిల్లాలోని గంగానదిలో చాలా మృతదేహాలు బయటపడటం కలకలం రేపింది.