BMW cars fire accident: మహారాష్ట్ర నవీ ముంబయిలోని బీఎండబ్ల్యూ సంస్థ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 45 వాహనాలు దగ్ధమయ్యాయి. నవీ ముంబయిలోని తుర్భే ప్రాంతంలో ఉన్న బీఎండబ్ల్యూ గోదాంలో మంగళవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది.
అగ్నిప్రమాదం సమాచారం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. 10 యంత్రాలతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. 6 గంటలపాటు శ్రమంచి మంటలను అదుపులోకి తెచ్చారు.
ఇదీ చూడండి: Benz car crash: ఐదు వాహనాల్ని ఢీకొట్టిన బెంజ్ కారు- ఒకరు మృతి