ETV Bharat / bharat

Blind Man Farming : కళ్లు కనిపించకపోయినా వ్యవసాయం.. పంటకు కంచె ఏర్పాటు.. సేద్యం పనులు ఈజీగా.. - వ్యవసాయం చేస్తున్న అంధుడు

Blind Man Farming : కొందరు అన్ని అవయవాలు సరిగ్గా ఉన్నా.. ఏం సాధించకుండా సాకులు చెబుతుంటారు. కానీ, ఈ వ్యక్తి మాత్రం రెండు కళ్లు లేకపోయినా.. వ్యవసాయం చేస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. అతడే తమిళనాడు తిరునెల్వెలి జిల్లాకు చెందిన మురుగేశన్. అతడి కథెంటో తెలుసుకోండి..

Blind Man Farming
Blind Man Farming
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 21, 2023, 1:54 PM IST

Updated : Oct 21, 2023, 7:11 PM IST

Blind Man Farming
వ్యవసాయ పనులు చేస్తున్న మురుగేశన్​

Blind Man Farming : ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి తమిళనాడు తిరునెల్వెలి జిల్లాకు చెందిన మురుగేశన్​. చిన్నతనంలోనే రెండు కళ్లు కోల్పోయిన అతడు.. దృఢ సంకల్పంతో వ్యవసాయం చేస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు. అంధత్వాన్ని సైతం లెక్కచేయకుండా దట్టమైన పశ్చిమ కనుమల్లో.. పులులు, చిరుతుల సంచారం మధ్యలోనే సేద్యం చేస్తున్నాడు.

చిన్నతనంలో అనారోగ్యానికి గురైన మురుగేశన్​.. సరైన వైద్యం అందకపోవడం వల్ల రెండు కళ్లను కోల్పోయాడు. మరోవైపు.. తండ్రి సైతం మురుగేశన్​, అతడి తల్లిని వదిలేసి వెళ్లి మరో వివాహం చేసుకున్నాడు. దీంతో తల్లే మురుగేశన్​ బాగోగులు చూస్తూ వచ్చింది. ఈ క్రమంలో చిన్నతనంలో సరదాగా తల్లికి తోడుగా పొలానికి వెళ్లిన మురుగేశన్​కు.. తర్వాత అదే ఆసక్తిగా మారింది. దీంతో తనకున్న భూమిలోనే వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు.

కళ్లు కనిపించకపోయినా వ్యవసాయం.. పంటకు కంచె ఏర్పాటు.. సేద్యం పనులు ఈజీగా..

కళ్లు ఉన్న వ్యక్తులు చేసే పనులన్నీ ఎలాంటి తడబాటు లేకుండా సులభంగా చేసేస్తున్నాడు మురుగేశన్​. విత్తనాలు నాటడం, కలుపు తీయడం నుంచి పంట కోసే వరకు అన్ని పనులు సులువుగా చేసేస్తున్నాడు. అంతేకాదు అడవి పందులు, జింకలు లాంటి వన్య ప్రాణుల నుంచి తన పంటను రక్షించుకునేందుకు పొలం చుట్టూ కంచెను సైతం వేశాడు. పండించిన పంటను సైతం తానే మార్కెట్​కు తీసుకెళ్లి విక్రయించి వస్తాడు. మురుగేశన్​ అరటితో పాటు దుంపలను సాగు చేస్తున్నాడు. వీటిని ఎక్కువగా చిప్స్​ తయారీలో వినియోగిస్తారు.

Blind Man Farming
వ్యవసాయ పనులు చేసేందుకు వెళ్తున్న మురుగేశన్​

"నాకు చిన్నప్పటి నుంచే కళ్లు కనిపించవు. 3 ఏళ్లు వయసులో కళ్లు పోయాయని మా అమ్మ చెప్పింది. అప్పటి నుంచి ఇలానే ఉంటున్నాను. చిన్నప్పటి నుంచి మా అమ్మతో కలిసి వ్యవసాయం చేయడం నాకు అలవాటు. అప్పటి నుంచి నాకు దీనిపై ఆసక్తి కలిగింది. ఇప్పుడు నేను వివిధ రకాల దుంపలను పండిస్తాను. ఇప్పుడు అదే నా లోకం."

--మురుగేశన్​, రైతు

మురుగేశన్​ నివసించే పెరియా మైలర్​తో పాటు ఈ పశ్చిమ కనుమల్లో అనేక గిరిజన గ్రామాలు ఉన్నాయి. సరైన రవాణ సౌకర్యం, మౌలిక సదుపాయాలు లేక అనేక మంది గిరిజనులు కాలం వెల్లదీస్తున్నారు. కరైయార్​ డ్యామ్​ వరకు మాత్రమే రవాణ సదుపాయం ఉండగా.. ఆ తర్వాత మరో 10 కిలోమీటర్లు కాలినడకన గ్రామానికి చేరుకోవాల్సి ఉంటుంది. దట్టమైన అడవి కావడం వల్ల పులులు, సింహాలు, ఎలుగుబంట్లు కూడా సంచరిస్తూ ఉంటాయి. అయితే, ఎన్నో ఏళ్లుగా ఇక్కడే నివసిస్తున్నా.. సరైన సౌకర్యాలు లేవు. నిత్యావసర సరకులు కోసం కూడా కొండలు ఎక్కి దిగాల్సిన పరిస్థితి. ప్రస్తుతం ఈ గ్రామాల్లో సుమారు 158 కుటుంబాలు జీవిస్తున్నాయి. వీరంతా వ్యవసాయం సహా అడవులు నుంచి వచ్చే వంటచెరకు, తేనెను విక్రయిస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు

Blind Man Farming
తల్లితో కలిసి వెళ్తున్న మురుగేశన్​

యాసిడ్ దాడితో అంధత్వం.. టెన్త్​లో 95% మార్కులతో స్కూల్ టాప్.. టార్గెట్ ఐఏఎస్​!

అంధురాలి ఆత్మవిశ్వాసం.. రెండు కళ్లు కోల్పోయినా.. యూట్యూబ్​లో వంటలు..

Last Updated : Oct 21, 2023, 7:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.