హరియాణాలో బ్లాక్ ఫంగస్ కేసులు ఆందోళకర స్థాయిలో పెరిగిపోతున్నాయి. సైబర్ సిటీగా పేరొందిన గురుగ్రామ్‌లో కొత్తగా 147 కేసులు వెలుగుచూశాయి. దీంతో రాష్ట్రంలో బాధితుల సంఖ్య 398కి చేరింది. ప్రధాన నగరాలైన.. హిసార్ 50, ఫరీదాబాద్ 46, సిర్సా 38, రోహతక్‌లో 21 చొప్పున కేసులు నమోదైనట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్(మ్యూకోమైకోసిస్) కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్ సీనియర్ అధికారులతో అత్యవసర సమావేశమయ్యారు. 12,000 యాంటీ ఫంగల్ ఇంజెక్షన్లను సరఫరా చేయాల్సిందిగా కేంద్రాన్ని కోరినట్లు మంత్రి తెలిపారు.
ఇప్పటికే.. వ్యాధి చికిత్సలో ఉపయోగించే ఆంఫోటెరిసిన్-బి ఔషధాన్ని గ్లోబల్ టెండర్ల ద్వారా సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఇవీ చదవండి: భారత్‌లో 2% కాదు.. 24% మందికి కరోనా!