ETV Bharat / bharat

కేంద్రానికి రైతు సంఘం నేత తీవ్ర హెచ్చరికలు - ట్రాక్టర్​ ర్యాలీ హింసాకాండ

తాము నిరసనలు తెలుపుతున్న దిల్లీ సరిహద్దు ప్రాంతం ఘాజిపుర్​లో విద్యుత్​ సరఫరాను నిలిపివేస్తే.. తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించారు బీకేయూ ప్రతినిధి రాకేశ్​ తికాయత్​. రైతులందరూ కలిసి స్థానిక పోలీస్​ స్టేషన్​కు వెళతారని స్పష్టం చేశారు. ఆ తర్వాత ఏం జరిగినా.. ఆ బాధ్యత ప్రభుత్వానిదేనని తేల్చిచెప్పారు.

BKU's Rakesh Tikait says farmers will head to local Police stations around Ghazipur border if the electricity is cut
'విద్యుత్​ కట్​ చేస్తే.. తీవ్ర పరిణామాలు'
author img

By

Published : Jan 28, 2021, 3:24 PM IST

భారతీయ కిసాన్​ యూనియన్​(బీకేయూ) ప్రతినిధి రాకేశ్​ తికాయత్​.. పోలీసులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఘాజిపుర్​ సరిహద్దులో విద్యుత్​ సరఫరా నిలిపివేస్తే.. తీవ్ర పరిణామాలు ఎదురవుతాయన్నారు. రైతులందరూ కలిసి స్థానిక పోలీసు స్టేషన్లకు వెళతారని పేర్కొన్నారు. ఆ తర్వాత ఏం జరిగినా.. దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.

మరోవైపు ట్రాక్టర్​ ర్యాలీ హింసాకాండపైనా స్పందించారు తికాయత్​. రైతు సంఘాల మధ్య చిచ్చు పెట్టి, దేశం నుంచి పంజాబ్​ను విడదీసేందుకు కొందరు కుట్ర పన్నినట్టు ఆరోపించారు. అందుకే శాంతియుత ర్యాలీలో హింస చెలరేగిందన్నారు.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ట్రక్టర్​ ర్యాలీ హింసకు దారి తీసింది. నిర్ణీత సమయం, నిర్దేశిత మార్గాలు వంటి నిబంధనలను ఉల్లంఘించిన నిరసనకారులు.. దిల్లీలోని అనేక ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించారు. ఎర్రకోటకు దూసుకెళ్లి ఓ మతానికి సంబంధించిన జెండాను ఎగురవేశారు. ఈ వ్యవహారంలో అనేకమందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. 200కుపైగా మందిని అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చూడండి:- 'ఎర్రకోట' ఘటనలపై దేశద్రోహం కేసు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.