ETV Bharat / bharat

తివా మండలి ఎన్నికల్లో భాజపా ఘన విజయం - టీఏసీ ఎన్నికలు

అసోం తివా మండలి ఎన్నికల్లో భాజపా ఘన విజయం సాధించింది. అసోం గణ పరిషత్ (ఏజీపీ) రెండు స్థానాలతో సరిపెట్టుకోగా కాంగ్రెస్ ఒకే స్థానానికి పరిమితమైంది.

bjp-won-assam-tiwa-autonomous-council-elections
తివా మండలి ఎన్నికల్లో భాజపా ఘన విజయం
author img

By

Published : Dec 20, 2020, 7:06 AM IST

Updated : Dec 20, 2020, 8:57 AM IST

అసోంలోని తివా స్వయం ప్రతిపత్తి మండలి (టీఏసీ) ఎన్నికల్లో భాజపా విజయ ఢంకా మోగించింది . మొత్తం 36 స్థానాలకు నిర్వహించిన ఎన్నికల్లో భాజపా 33 స్థానాలను కైవసం చేసుకుంది. అసోం గణ పరిషత్ (ఏజీపీ) రెండు స్థానాలతో సరిపెట్టుకోగా కాంగ్రెస్ ఒకే స్థానానికి పరిమితమైంది. ఈ సందర్భంగా సీఎం శర్వానంద సోనోవాల్ ప్రజలకు కృతజ్ఢతలు తెలిపారు.

టీఏసీ ఎన్నికల్లో భాజపాకు ఘన విజయాన్ని కట్టబెట్టినందుకు సీఎం శర్వానంద సోనోవాల్ ప్రజలందరికీ ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయంపై సీఎంకు, కార్యకర్తలకు ఆ రాష్ట్ర పార్టీ ఇంఛార్జీ, ప్రధాన కార్యదర్శి వైజయంత్​ జై పండా అభినందనలు తెలిపారు.

  • My heartfelt thanks to all for reposing their faith in @BJP4Assam and giving a huge mandate in #TACElections. I reiterate our promise of all-round and inclusive development of the region through good governance & efficient administration.

    — Sarbananda Sonowal (@sarbanandsonwal) December 19, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"అసోం ప్రజలు పూర్తిగా ప్రధాని నరేంద్ర మోదీ వెంటే ఉన్నారు. ముఖ్యమంత్రి శర్వానంద సోనోవాల్ సహా హిమంత విశ్వ, రంజీత్ దాస్, కార్యకర్తలకు అభినందనలు "

-- వైజయంత్ జై పండా, భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

ఇదీ చూడండి : లాలూ కిడ్నీలు దెబ్బతిన్నాయన్న వైద్యుడికి తాకీదులు

Last Updated : Dec 20, 2020, 8:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.