ETV Bharat / bharat

' విద్వేషాన్ని పెంచుతున్న భాజపా, ఆర్‌ఎస్‌ఎస్' - Congress leader Rahul Gandhi on lashed out at Bharatiya Janata Party (BJP)

భాజపా ప్రజల్లో విభజనరేఖల్ని, విద్వేషాన్ని నింపుతుందని కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ ఆరోపించారు. బంగాల్​ సంస్కృతిని అది నాశనం చేస్తుందని మండిపడ్డారు.

Rahul Gandhi
రాహుల్​ గాంధీ
author img

By

Published : Apr 14, 2021, 9:32 PM IST

భాజపా, ఆర్​ఎస్​ఎస్​లు ఎక్కడికెళ్లినా ప్రజల్లో విద్వేషాలను, విభజన బీజాలను నాటుతున్నాయని కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ ఆరోపించారు. బంగాల్​లోని డార్జిలింగ్​లో ఆయన ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు.

"మా చరిత్ర, సంస్కృతి దాడుల్ని ఎదుర్కొంటోందని అసోం ప్రజలు చెప్పారు. తమిళనాడు, బంగాల్​ కూడా అదే విధమైన దాడుల్ని ఎదుర్కొంటున్నాయి. భాజపా, ఆర్​ఎస్​ఎస్​ ఎక్కడికెళ్లినా విద్వేషాల్ని వ్యాపింపచేస్తాయి."

-రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ నేత

బంగారు బంగాల్​ నిర్మిస్తామని భాజపా అంటోందని, అవన్నీ ఎండమావుల్లాంటి హామీలే అని విమర్శించారు. ఏ రాష్ట్రానికి వెళ్లినా 'మీ రాష్ట్రం బంగారు రాష్ట్రం చేస్తాం' అని భాజపా చెబుతోందని అన్నారు.

'ఆట వేరు.. సేవ వేరు'

భాజపాతో కాంగ్రెస్​ జత కలుస్తుందన్న మమతా బెనర్జీ వ్యాఖ్యల్ని రాహుల్​ ఖండించారు. కాంగ్రెస్​ ఎప్పటికీ భాజపాతో కలవదని దాని ముందు తలవంచదని స్పష్టం చేశారు. అయితే భాజపా, తృణమూల్​లు ఇదివరకు కలిసి పనిచేశాయని, ఇప్పుడు కూడా మళ్లీ కలిసే అవకాశం ఉందని అన్నారు. ఆట మొదలైంది అన్న మమత వ్యాఖ్యలను రాహుల్​ ప్రస్థావించారు. ప్రజలకు సేవ చేయడం..ప్రజలతో ఆటలాడటం ఒక్కటి కాదని విమర్శించారు.

కరోనా కట్టడి విషయంలో ప్రధాని మోదీ పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్​ ఇచ్చిన సలహాలను పట్టించుకోలేదని తెలిపారు.

ఇదీ చదవండి: బంగాల్​ దంగల్​: నక్సల్​బరిపై భాజపా జెండా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.