ETV Bharat / bharat

భాజపా వల్లే బంగాల్​లో కరోనా వ్యాప్తి: దీదీ

author img

By

Published : Apr 16, 2021, 5:17 PM IST

బంగాల్​లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం భాజపా.. ఇతర రాష్ట్రాల వారిని అనుమతించడంపై ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇతర రాష్ట్రాల వ్యక్తులపై నిషేధం విధించేలా చర్యలు చేపట్టాలని తాను ఈసీని కోరనున్నట్టు చెప్పారు.

TMC leader Mamata in Election campaign
టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ

బంగాల్​ ఎన్నికల ప్రచారంలో ఇతర రాష్ట్రాల వ్యక్తులను భారతీయ జనతా పార్టీ(భాజపా).. తీసుకురాకుండా తాను ఎన్నికల సంఘాన్ని కోరనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. నదియా జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన దీదీ.. రాష్ట్రంలో కరోనా కేసులు పెరగడానికి భాజపాయే కారణమని విమర్శించారు.

"కరోనా కేసులు ఎక్కువగా ఉన్న గుజరాత్‌ నుంచి ప్రజలను భాజపా తెప్పిస్తోంది. ప్రధాని మోదీ, ఇతర భాజపా నేతలు ప్రచారానికి వస్తే మేము చేసేదేమీ లేదు. అయితే.. సభల్లో వేదికలు, గుడారాల నిర్మాణానికి గుజరాత్‌ నుంచి కార్మికులను తీసుకొస్తున్నారు. ఈ పనులను స్థానిక కార్మికులతోనే చేయిస్తే సరిపోతుంది."

- మమతా బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి

తన కాలిపై దాడి చేసి తాను ప్రచారంలో పాల్గొనకుండా భాజపా ఆపాలని చూసిందని మమత ఆరోపించారు. అయితే.. ప్రజల దీవెనల వల్ల భాజపాది తప్పని తాను నిరూపించినట్లు చెప్పారు. తన కాలికి అయిన గాయం 75 శాతం నయమైందని వ్యాఖ్యానించారు దీదీ.

ఇదీ చదవండి: 'అందుకే దీదీ వారికి పౌరసత్వం ఇవ్వడం లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.