2019-20 మధ్య రాజకీయ పార్టీలకు వచ్చిన విరాళాల్లో అత్యధికంగా భాజపాకు రూ.785 కోట్లు అందాయి. ఈ మొత్తం కాంగ్రెస్‌కు అందిన విరాళాల కన్నా ఐదు రెట్లు ఎక్కువ. కాంగ్రెస్ పార్టీకి రూ.139 కోట్లు రాగా.. తృణమూల్ కాంగ్రెస్‌కు రూ.8 కోట్లు, సీపీఐకి రూ.1.3 కోట్లు, సీపీఐ(ఎం)కు రూ.19.7 కోట్లు విరాళాలు వచ్చాయి. ఇటీవల ఈ పార్టీలు ఎన్నికల సంఘానికి అందించిన నివేదికలో ఈ వివరాలను పేర్కొన్నాయి.
భాజపాకు అందిన విరాళాల్లో అత్యధికంగా ఎలక్టోరల్ ట్రస్ట్‌లు, కార్పొరేట్ సంస్థలు, పార్టీ నేతల నుంచి ఉన్నాయి. నేతల్లో పీయూష్ గోయల్, పెమా ఖండు, కిరణ్ ఖేర్, రమణ్ సింగ్‌లు ఎక్కువ విరాళాలు ఇచ్చారు.
కార్పొరేట్ సంస్థల్లో ఐటీసీ, కల్యాణ్ జువెలర్స్, రేర్ ఎంటర్‌ప్రైజస్, అంబుజా సిమెంట్ వంటి సంస్థలు భాజపాకు విరాళాలు ఇచ్చిన జాబితాలో ఉన్నాయి.
రూ.20 వేలు మించిన విరాళాలను పరిగణలోకి తీసుకొని ఈ నివేదిక రూపొందిస్తారు. కరోనా మహమ్మారి కారణంగా పార్టీలు వార్షిక ఆడిట్ రిపోర్ట్‌లను సమర్పించేందుకు జూన్ 30 వరకు గడువు పొడిగించింది.
ఇదీ చదవండి : మొన్న సింధియా.. నిన్న ప్రసాద.. తర్వాత?