ETV Bharat / bharat

'భాజపా నాకు డబ్బులు ఇస్తానంది.. కానీ...'

కర్ణాటకలో భాజపా ఎమ్మెల్యే ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చేందుకు పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వజూపిందని అన్నారు. అయితే ఇది కాస్తా వివాదాస్పదం కావడం వల్ల.. ఎమ్మెల్యే తన వ్యాఖ్యలపై యూటర్న్‌ తీసుకున్నారు.

BJP MLA CASH DEMAND
శ్రీమంత్ పాటిల్
author img

By

Published : Sep 13, 2021, 1:32 PM IST

రెండేళ్ల క్రితం కర్ణాటకలో కాంగ్రెస్‌-జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలడానికి (jds congress govt in karnataka) భాజపా 'ఆపరేషన్‌ కమల్‌' కారణమంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. తాజాగా అందుకు సంబంధించి భాజపా ఎమ్మెల్యే ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ను వీడేందుకు కాషాయ పార్టీ తనకు పెద్ద మొత్తంలో డబ్బు ఆఫర్‌ చేసినట్లు చెప్పారు. ఇది కాస్తా తీవ్ర దుమారం రేపగా నాలుక్కరుచుకున్న ఆ ఎమ్మెల్యే తానలా అనలేదంటూ మాటమార్చడం గమనార్హం. అసలేం జరిగిందంటే..

భాజపా ఎమ్మెల్యే శ్రీమంత్‌ బాలసాహెబ్‌ పాటిల్‌ (Shrimant Patil) ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. "భాజపాలో చేరేందుకు నాకు డబ్బు ఆఫర్‌ చేశారు. ఎంత కావాలంటే అంత అడగొచ్చని చెప్పారు. కానీ, నేను ఒక్క పైసా తీసుకోకుండా భాజపాలో చేరాను. అయితే, ప్రజలకు సేవ చేసేందుకు మంత్రి (shrimant patil minister) పదవి అడిగాను. కానీ, ఎందుకనో ప్రస్తుత ప్రభుత్వంలో నాకు మంత్రి పదవి రాలేదు. తర్వాతి మంత్రివర్గ విస్తరణలో నాకు పదవి ఇస్తానని పార్టీ హామీ ఇచ్చింది" అని వెల్లడించారు.

mla srimant patil
ఎమ్మెల్యే శ్రీమంత్‌ పాటిల్‌

దుమారం..

పాటిల్‌ వ్యాఖ్యలు కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. కాంగ్రెస్‌ నేత డీకే శివకుమార్‌ (DK Shivakumar) ట్విటర్‌ వేదికగా భాజపాపై మండిపడ్డారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరపాలని డిమాండ్‌ చేశారు. "ఆపరేషన్‌ కమల్‌లో భాగంగా పాటిల్‌కు డబ్బు ఆశజూపి భాజపాలోకి తీసుకున్నారు. ఇప్పుడైనా ఆయన నిజం చెప్పినందుకు ఆనందంగా ఉంది. దీనిపై వెంటనే ఏసీబీ దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి" అని శివకుమార్‌ ట్వీట్ చేశారు.

వివరణ..

అయితే ఇది కాస్తా వివాదాస్పదం కావడం వల్ల పాటిల్‌ తన వ్యాఖ్యలపై యూటర్న్‌ తీసుకున్నారు. భాజపా తనకు ఎలాంటి డబ్బు ఆఫర్‌ చేయలేదని, తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆరోపించారు. తననెవరూ ప్రలోభపెట్టలేదని, భాజపా విధానాలు నచ్చి స్వచ్ఛందంగా ఆ పార్టీలో చేరినట్లు చెప్పుకొచ్చారు.

శ్రీమంత్‌ పాటిల్‌ కాగ్వాడ్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే, 2019లో ఆయనతో పాటు మరో 16 మంది కాంగ్రెస్‌, జేడీఎస్‌ ఎమ్మెల్యేలు తమ పార్టీ వీడి భాజపాలో చేరారు. దీంతో కుమారస్వామి నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలి.. భాజపా అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత యూడియూరప్ప సీఎంగా భాజపా ప్రభుత్వం ఏర్పాటైంది. అందులో, శ్రీమంత్ పాటిల్‌కు మంత్రిపదవి ఇచ్చారు. ఇటీవల యడియూరప్ప రాజీనామా చేయడంతో బసవరాజ్‌ బొమ్మైకు రాష్ట్ర పగ్గాలు అప్పగించారు. కొత్త ప్రభుత్వంలో పాటిల్‌కు మంత్రివర్గంలో చోటు దక్కలేదు.

ఇదీ చదవండి: 'పెగసస్​పై​ మరో అఫిడవిట్ సమర్పించలేం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.