భాజపా మహిళా నేతలు దాండియా నృత్యాలు చేస్తూ.. దోశలు వేస్తూ తమిళనాడు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు.
కోయంబత్తూర్ అసెంబ్లీ నియోజక వర్గానికి భాజపా నుంచి పోటీ చేసిన వనతి శ్రీనివాసన్ తరఫున కేంద్ర మంత్రి, భాజపా నేత స్మృతి ఇరానీ ప్రచారంలో పాల్గొన్నారు. కార్యకర్తలతో కలిసి దాండియా నృత్యం చేశారు.
థౌజండ్ లైట్స్ అసెంబ్లీ నియోజక వర్గంలో భాజపా నేత, అభ్యర్థి కుష్బూ సుందర్ ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ఆమె ఓ చిన్న హోటల్‌కు వెళ్లి దోశలు వేశారు.
ఇదీ చదవండి: 'గెలిపిస్తే.. మోకాలి నొప్పికి ఉచితంగా శస్త్రచికిత్స'