ETV Bharat / bharat

Assembly polls 2022: యూపీ పీఠం భాజపాదే- పంజాబ్​లో ఆప్ హవా! - ఎన్నికలు 2022

వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు (UP Election 2022) జరగనున్న ఐదు రాష్ట్రాల్లో నిర్వహించిన సర్వేలో (ABP Cvoter opinion poll) ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. యూపీలో కమలదళానిదే అధికారమని సర్వేలో (Five State election 2022) స్పష్టమైంది. అయితే, వందకు పైగా సీట్లు భాజపా కోల్పోతుందని తేలింది. మరోవైపు, పంజాబ్​లో ఆమ్ ఆద్మీ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని సర్వే పేర్కొంది.

5 states assembly election 2022
5 states assembly election 2022
author img

By

Published : Nov 13, 2021, 10:42 AM IST

ఉత్తర్​ప్రదేశ్​లో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో (UP Election 2022) విజయం భారతీయ జనతా పార్టీదేనని ఏబీపీ-సీఓటర్-ఐఏఎన్ఎస్ స్నాప్ పోల్​లో (ABP Cvoter opinion poll) వెల్లడైంది. 403 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తర్​ప్రదేశ్​లో (UP Election 2022) భాజపా తన మిత్ర పక్షాలతో కలిసి 217 సీట్లు దక్కించుకుంటుందని సర్వే తెలిపింది. 2017లో గెలిచిన 325 సీట్ల కంటే 108 స్థానాలు తక్కువ అని వివరించింది. ఈ స్థానాలను.. గణనీయంగా పుంజుకుంటున్న సమాజ్​వాదీ పార్టీ దక్కించుకోనుందని వెల్లడించింది. ఉత్తర్​ప్రదేశ్​లో (UP Election 2022) ప్రధానంగా భాజపా, ఎస్పీ మధ్యే పోటీ నెలకొందని పేర్కొంది. సమాజ్​వాదీ పార్టీ 156 సీట్లు దక్కించుకునే అవకాశం ఉందని తెలిపింది.

అయితే, భాజపా ఓట్ల శాతంలో (UP Election 2022) పెద్దగా తేడా ఉండదని సర్వే (ABP Cvoter opinion poll) తెలిపింది. 40.7 శాతం ఓట్లు సాధిస్తుందని పేర్కొంది. ఇది గత ఎన్నికలతో పోలిస్తే 0.7 శాతం తక్కువ. మరోవైపు, ఎస్పీ 7.1 శాతం అధికంగా.. 31.1 శాతం ఓట్లను సాధిస్తుందని పేర్కొంది.

మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో..

ఉత్తర్​ప్రదేశ్​తో (UP Election 2022) పాటు ఎన్నికలు జరగనున్న పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపుర్​ రాష్ట్రాల్లోనూ (Five State election 2022) సర్వే నిర్వహించారు. ఉత్తరాఖండ్​లో (Uttarakhand Election 2022) కాంగ్రెస్ బలంగా పుంజుకునే అవకాశం ఉందని సర్వే పేర్కొనగా... పంజాబ్​లో (Punjab Election 2022) అతిపెద్ద పార్టీగా ఆమ్ ఆద్మీ అవతరించనుందని తెలిపింది.

ఉత్తరాఖండ్​లో 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. భాజపా 38 సీట్లతో మెజార్టీ మార్క్​ను దాటుతుందని సర్వే పేర్కొంది. గతంలో సాధించిన 57 సీట్లతో పోలిస్తే 19 స్థానాలు తగ్గుతాయని అంచనా వేసింది. కాంగ్రెస్ 21 సీట్లు అధికంగా సాధించి.. అసెంబ్లీలో తన బలాన్ని 32 స్థానాలకు పెంచుకుంటుందని పేర్కొంది.

పంజాబ్​లో ఆప్ హవా!

మరోవైపు, 'పంజాబ్​లో ఆమ్ ఆద్మీ పార్టీ 51 స్థానాలతో అందరికంటే ముందంజలో ఉంది. 117 స్థానాలున్న అసెంబ్లీలో కాంగ్రెస్ 46 సీట్లకు పరిమితం కానుంది. గత ఎన్నికల్లో 77 సీట్లు సాధించిన కాంగ్రెస్ ఈ సారి 31 నియోజకవర్గాలు కోల్పోనుంది. అయితే, కొత్త ముఖ్యమంత్రి చరణ్​జీత్ సింగ్ చన్నీ పాలన.. ఎన్నికల్లో కాంగ్రెస్​కు కలిసొచ్చే అవకాశం ఉంది. 20 సీట్లతో అకాలీదళ్​ మూడో స్థానంలో నిలవనుంద'ని సర్వే పేర్కొంది.

గోవా, మణిపుర్ భాజపాదే

40 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న గోవాలో (Goa Election 2022) భాజపా 21 స్థానాలతో ముందంజలో ఉంటుందని సర్వే (ABP C Voter opinion poll Goa) అంచనా వేసింది. ఆప్ 5, కాంగ్రెస్ 4 స్థానాల్లో గెలుస్తుందని లెక్కగట్టింది. ఇతరులు 10 చోట్ల గెలుపొందుతారని పేర్కొంది.

చివరగా.. మణిపుర్​లో (Manipur Election 2022) భాజపాదే ఆధిక్యమని సర్వేలో తేలింది. మొత్తం 60 స్థానాలు ఉండగా.. భాజపా 27, కాంగ్రెస్ 22 సీట్లను గెలుచుకుంటాయని అంచనా వేసింది.

మోదీ, కేంద్రం పనితీరుపై...

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పనితీరుపై ఐదు రాష్ట్రాల్లో సర్వే నిర్వహించగా.. 41.4 శాతం మంది 'చాలా సంతృప్తికరం'గా ఉన్నట్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. 26.9 శాతం మంది కొంతవరకు సంతృప్తికరమని పేర్కొనగా.. 29.1 శాతం మంది అసలు సంతృప్తిగా లేమని చెప్పారు. 2.6 శాతం మంది 'ఏమీ చెప్పలేం' అని బదులిచ్చారు.

కేంద్ర ప్రభుత్వ పనితీరుపై 36.3 శాతం మంది 'చాలా వరకు సంతృప్తి' వ్యక్తం చేయగా.. 28.4 శాతం మంది కొంతవరకు సంతృప్తి చెందినట్లు తెలిపారు. 31.8 శాతం మంది అసలు సంతృప్తికరంగా లేమని చెప్పారు. 3.5 శాతం మంది చెప్పలేమని అన్నారు. ప్రధాని, కేంద్ర ప్రభుత్వ పనితీరు పట్ల సంతృప్తికరంగా లేని వారు పంజాబ్​లోనే అధికంగా ఉన్నారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.