ETV Bharat / bharat

'కేంద్రం అన్నింటా విఫలం.. మోదీ వాస్తవాలు తెలుసుకోవాలి'

రైతుల్లో అసంతృప్తి, ద్రవ్యోల్బణం, సరిహద్దు సమస్యలు సహా అన్నింటా కేంద్రం విఫలమైందని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. ఈ వైఫల్యం ఇకపై కూడా కొనసాగుతుందని చెప్పారు.

rahul gandhi
రాహుల్ గాంధీ
author img

By

Published : Oct 23, 2021, 9:03 PM IST

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. కేంద్ర ప్రభుత్వంపై మరోసారి విమర్శల దాడి చేశారు. రైతుల్లో అసంతృప్తి, ద్రవ్యోల్బణం, సరిహద్దు సమస్యలు సహా అన్నింటా భాజపా ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఈ వైఫల్యాన్ని కేంద్రం ఇక ముందు కూడా కొనసాగిస్తుందని చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్​ చేశారు.

"రైతులు బాధపడుతున్నారు. ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకింది. సరిహద్దుల్లో ఘర్షణలు జరుగుతున్నాయి. అయినా భారత్ గొప్పదే. కానీ, కేంద్ర ప్రభుత్వమే ఓడిపోయింది. ఈ ఓటమి ఇక ముందు కూడా కొనసాగుతుంది.

-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత

రాహుల్ తన ట్వీట్​కు #BJPFailsIndia హ్యాష్​ట్యాగ్​ను జతచేశారు.

ద్రవ్యోల్బణం, రైతులు, సరిహద్దు ఉద్రిక్తతలపై ప్రధాని నరేంద్ర మోదీ దృష్టిసారించాలని కోరుతూ #ModiHoshMeinAao హ్యాష్​ట్యాగ్​తో కాంగ్రెస్​.. ఓ వీడియోను ట్విట్టర్​ వేదికగా పోస్ట్ చేసింది. 'మోదీ వాస్తవాలను సరి చూసుకోవాల్సిన అవసరం ఉంద'ని పేర్కొంటూ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేసింది.

ఇదీ చూడండి: యూపీలో కాంగ్రెస్ యాత్ర- మహిళా రైతులతో ప్రియాంక ముచ్చట!

ఇదీ చదవండి: కాంగ్రెస్ వరాలు.. వారికి స్మార్ట్​ఫోన్​లు, ఈ-స్కూటీలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.