అసోంలో శాసనసభ ఎన్నికల వేళ 15 మంది సీనియర్ నేతలకు భాజపా షాకిచ్చింది. మాజీ డిప్యూటీ స్పీకర్ దిలీప్ కుమార్ పాల్ సహా.. 15 మందిని పార్టీ నుంచి బహిష్కరిస్తూ ఆ రాష్ట్ర భాజపా శాఖ నిర్ణయం తీసుకుంది.
శాసనసభ ఎన్నికల్లో సీటు కేటాయించకపోవటంతో.. ఆ నాయకులంతా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఆగ్రహించిన భాజపా అధిష్ఠానం.. 15 మందిని బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇదివరకే వారంతా భాజపాకి రాజీనామా చేసి, స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలో నిలబడ్డారు.
ఇదీ చదవండి: 148మంది అభ్యర్థులతో భాజపా 'బంగాల్' జాబితా