బంగాల్లో మళ్లీ రాజకీయం వేడెక్కింది. భవానీపుర్ ఉపఎన్నికకు(Bhabanipur Election) ముందు.. అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ), భాజపా మధ్య మాటల యుద్ధం మొదలైంది.
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్(Prashant Kishor).. ఉపఎన్నిక జరగనున్న భవానీపుర్‌లో ఓటరుగా నమోదు చేసుకున్నారని ఆరోపిస్తోంది భాజపా. బోహిరగాటో (బయటివ్యక్తి) ఇక్కడి ఓటర్ (Prashant Kishor West Bengal Election) ఎలా అయ్యారని శనివారం ప్రశ్నించింది.
చివరకు ప్రశాంత్ కిశోర్(Bhabanipur Election) భవానీపుర్ ఓటర్ అయ్యారని ఎద్దేవా చేసింది భాజపా. ఈ మేరకు ఓటర్ లిస్ట్‌లో పీకే వివరాలతో ఉన్న ఫొటోను భాజపా మీడియా విభాగం ఇంఛార్జ్ సప్తర్షి చౌదరి ట్వీట్ చేశారు. సీఎం మమతా బెనర్జీ, టీఎంసీ, టీఎంసీ ప్రతినిధి కునాల్ ఘోష్‌ను ట్యాగ్ చేశారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. బయట రాష్ట్రాల భాజపా నేతలను ఉద్దేశించి టీఎంసీ ఉపయోగించిన 'బోహిరగాటో' అనే పదాన్ని కూడా ట్వీట్లో ప్రస్తావించారు సప్తర్షి.
-
অবশেষে @PrashantKishor ভবানীপুরের ভোটার!!
— সপ্তর্ষি চৌধুরী • Saptarshi Chowdhury (@saptarshiOFC) September 25, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
বাংলার মেয়ে কি তবে বহিরাগত ভোটার চায়!!@AITCofficial @KunalGhoshAgain জানতে চায় রাজ্যের মানুষ pic.twitter.com/E3sTW8oqsg
">অবশেষে @PrashantKishor ভবানীপুরের ভোটার!!
— সপ্তর্ষি চৌধুরী • Saptarshi Chowdhury (@saptarshiOFC) September 25, 2021
বাংলার মেয়ে কি তবে বহিরাগত ভোটার চায়!!@AITCofficial @KunalGhoshAgain জানতে চায় রাজ্যের মানুষ pic.twitter.com/E3sTW8oqsgঅবশেষে @PrashantKishor ভবানীপুরের ভোটার!!
— সপ্তর্ষি চৌধুরী • Saptarshi Chowdhury (@saptarshiOFC) September 25, 2021
বাংলার মেয়ে কি তবে বহিরাগত ভোটার চায়!!@AITCofficial @KunalGhoshAgain জানতে চায় রাজ্যের মানুষ pic.twitter.com/E3sTW8oqsg
''చివరకు ప్రశాంత్ కిశోర్.. భవానీపుర్ ఓటర్‌గా మారారు. ఈ బయటి ఓటర్‌కు బంగాల్ కుమార్తె(మమతా బెనర్జీ) అనుకూలంగా ఉంటారో లేరో మాకైతే కచ్చితంగా తెలియదు.''
- సప్తర్షి చౌదరీ, భాజపా మీడియా సెల్ ఇంఛార్జ్
దీనికి తృణమూల్ కాంగ్రెస్ నేతలు గట్టిగానే బదులిస్తున్నారు. భవానీపుర్ ఉపఎన్నిక(Bhabanipur Election) కోసం.. భాజపా ఇప్పటికీ బయట వ్యక్తులను ప్రచారానికి రప్పిస్తోందని ఆరోపించారు ఫర్హాద్ హకీమ్.
ఎన్నికల కమిషన్ వెబ్సైట్ ప్రకారం.. ఉపఎన్నికపై ప్రకటన వెలువడక ముందే, భవానీపుర్ ఓటర్ల జాబితాలో ప్రశాంత్ కిశోర్ అనే పేరు ఉంది.
వ్యూహకర్తగా గుడ్‌బై..
బంగాల్ అసెంబ్లీ ఎన్నికల కోసం.. టీఎంసీకి రాజకీయ వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిశోర్(Prashant Kishor West Bengal Election), ఆ ఫలితాల అనంతరం ఇక తాను పొలిటికల్ స్ట్రాటజిస్ట్‌గా ఉండబోనని ప్రకటించారు. క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌లో ఆయన చేరేందుకు సిద్ధమయ్యారని వార్తలొస్తున్నాయి. దీనిపై మరికొద్దిరోజుల్లో స్పష్టత వచ్చే అవకాశముంది.
భవానీపుర్ ఉపఎన్నిక కొద్దిరోజుల్లో జరగనుండగా.. పీకే ఇప్పటివరకు అక్కడ ప్రచారంలో కనిపించిన దాఖలాలు లేవు. అయితే టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీతో దిల్లీలో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
సెప్టెంబర్ 30న ఎన్నిక..
సెప్టెంబర్ 30న భవానీపుర్‌కు ఉపఎన్నిక(Bhabanipur Election) జరగనుంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee Election), భాజపా అభ్యర్థి ప్రియాంక తిబ్రేవాల్ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. సీఎంగా కొనసాగాలంటే మమత.. ఇక్కడ గెలవడం తప్పనిసరి.
ఏప్రిల్‌లో జరిగిన బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 294 స్థానాలకు టీఎంసీ (TMC Election) 213 కైవసం చేసుకుంది. భాజపా 77 చోట్ల గెలిచి ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది.
నందిగ్రామ్ నుంచి పోటీచేసిన బంగాల్ ముఖ్యమంత్రి మమత(Mamata Banerjee Election) సువేందు అధికారి చేతిలో ఓడిపోయారు. అయినా సీఎంగా బాధ్యతలు స్వీకరించిన దీదీ.. ఆరు నెలల్లో ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో భవానీపుర్ నుంచి ఎన్నికైన సోబన్దేవ్ ఛటోపాధ్యాయ రాజీనామా చేయగా.. ఉపఎన్నిక(Bhabanipur By Election) నిర్వహిస్తోంది ఎన్నికల సంఘం.
ఇవీ చూడండి: Bhabanipur Election: దెబ్బతిన్న పులి X ధైర్యవంతురాలు
భవానీపుర్‌లో మమత ఎన్నిక లాంఛనమేనా?
భవానీపుర్ స్థానానికి బంగాల్ సీఎం నామినేషన్