బంగాల్ మాల్దా నియోజకవర్గం భాజపా అభ్యర్థి గోపాల్ చంద్ర సహాపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. సహపుర్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ఆయనపై కాల్పులు జరిగాయి. ప్రస్తుతం ఆయన మాల్దా మెడికల్ కాలేజీ, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
తృణమూల్ కార్యకర్తలే.. చంద్ర సాహాపై కాల్పులు జరిపారని భాజపా నేతలు ఆరోపించారు. ఈ ఘటనకు నిరసనగా సోమవారం ర్యాలీ నిర్వహిస్తామన్నారు. ఈ ఘటనపై పోలీసులు ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన చేయలేదు.
ఇదీ జరిగింది : 'మహా'లో కరోనా కల్లోలం- కొత్తగా 68వేల కేసులు