బంగాల్లో మోయనా అసెంబ్లీ నియోజవర్గ భాజపా అభ్యర్థి, మాజీ క్రికెటర్ అశోక్ దిండాపై కొందరు దుండగులు దాడి చేశారు. ఈ ఘటనలో ఆయన భుజానికి తీవ్ర గాయమైంది.
మంగళవారం నాడు ఎన్నికల ప్రచారం ముగించుకుని వస్తుండగా మోయనా బజార్లో షాజహాన్ అలీ, మరికొందరు తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలతో వచ్చి దాడి చేశారని అశోక్ దిండా మేనేజర్ ఆరోపించారు.
అయితే ఆయన ఆరోపణలను టీఎంసీ ఖండించింది. భాజపాలో అశోక్ దిండాను వ్యతిరేకిస్తున్నవారే ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపించింది. ఘటనపై ఈసీ ఆరా తీసింది.
వై ప్లస్ భద్రత:
అశోక్ దిండాపై దాడి జరిగిన నేపథ్యంలో ఆయనకు వై ప్లస్ భద్రతను కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
ఇదీ చదవండి: నందిగ్రామ్ రణం: నాడు వద్దన్నదే.. నేడు ముద్దు!