మధ్యప్రదేశ్‌లో వింత ఘటన వెలుగుచూసింది. కొవిడ్ మార్గదర్శకాలను పకడ్బందీగా అమలు చేస్తున్న ఆ రాష్ట్ర ప్రభుత్వం.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలకు ఉపక్రమిస్తోంది. నిబంధనలు అతిక్రమించి బయట తిరుగుతున్న ఓ శునకాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు పోలీసులు. దాంతోపాటు యజమానినీ అదుపులోకి తీసుకున్నారు.
ఏం జరిగిందంటే?
కరోనా విజృంభణ నేపథ్యంలో ఎంపీలో కఠిన లాక్డౌన్ అమల్లోఉంది. రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్న సమయంలో.. ఇందోర్‌లోని పలాసియా ప్రాంతంలో ఓ శునకం, దాని యజమాని మనీశ్ సింగ్ రోడ్డుపై సంచరిస్తూ పోలీసుల కంటపడ్డారు. కొవిడ్ మార్గదర్శకాలను ఉల్లంఘించిన కారణంగా.. ఆ శునకాన్ని, మనీశ్‌ను అరెస్ట్ చేసి ఠాణాకు తరలించారు.
ఆ తర్వాత.. మన్నించి వదిలిపెట్టమని పోలీసులను వేడుకున్నాడు మనీశ్. బాధితుడి అభ్యర్థనను మన్నించిన పోలీసులు.. గట్టిగా హెచ్చరించి వదిలిపెట్టారు. ఈ విషయం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారగా.. దీనిపై తెగ జోకులు వేసుకుంటున్నారు నెటిజన్లు.
ఇదీ చదవండి: 'మరాఠా కోటా' తీర్పు.. రిజర్వేషన్లకు లక్ష్మణ రేఖ