ETV Bharat / bharat

ఆరేళ్ల క్రితం మిస్సింగ్​.. జైలులో ప్రత్యక్షం.. కానీ అంతలోనే.. - కనిపించకుండా పోయిన వ్యక్తి జైలులో ఉన్నట్లు లేఖ

ఆరేళ్ల క్రితం కనిపించకుండా పోయిన ఓ వ్యక్తి బతికున్నాడంటూ కుటుంబ సభ్యులకు లేఖ అందింది. కానీ ఆ ఆనందం ఎంతసేపు నిలవలేదు. అతడిని ఉగ్రవాదిగా భావించి అరెస్టు చేసినట్లు లేఖలో ఉంది. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటన బిహార్ భాగల్​పుర్​లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే..

six years ago missing man found in amritsar jail
ఆరేళ్ల క్రితం కనిపించకుండా పోయిన వ్యక్తి
author img

By

Published : Feb 4, 2023, 8:43 PM IST

Updated : Feb 4, 2023, 10:13 PM IST

కర్ణాటక వెళ్లి తిరిగొస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన ఇందల్ రాయ్ అనే వ్యక్తి ఆరేళ్ల కింద అదృశ్యమైపోయాడు. అప్పటి నుంచి కుటుంబ సభ్యులు ఎంత వెతికినా అతడి ఆచూకీ తెలియరాలేదు. దీంతో కుటుంబ సభ్యులు అతడిపైన ఆశలు వదిలేసుకున్నారు. అయితే తాజాగా అరవింద్ కుమార్ చౌదరి అనే వ్యక్తి నుంచి వచ్చిన ఓ లేఖ వారిలో ఆశ చిగురించింది. అయితే ఆ లేఖలో ఇందల్​ను ఉగ్రవాదిగా అనుమానిస్తూ అమృత్​సర్​లోని జైలులో ఉంచినట్లు ఉంది. ఈ ఘటన బిహార్ భాగల్​పుర్​లో జరిగింది.

ఈ వార్త కొంత ఆందోళలకు గురి చేసినా.. ఇందల్​ బతికే ఉన్నాడన్న విషయం తెలిసి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఇందల్​ను అమృత్​సర్​లోని జైలులో కలిసినట్లు చౌదరి లేఖలో రాశారు. కర్ణాటకకు బయలుదేరానని, పొరపాటున పంజాబ్​ వచ్చానని తనతో చెప్పినట్లు చౌదరి లేఖలో జోడించారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ అమృత్​సర్​కు చేరుకున్నానని తెలిపాడని చౌదరీతో తెలిపాడు. అయితే ఈ క్రమంలోనే ఇందల్​ను ఉగ్రవాదిగా అనుమానిస్తూ అమృత్​సర్​ పోలీసులు అరెస్టు చేసినట్లు లేఖలో చౌదరి రాశారు.

six years ago missing man found in amritsar jail
ఇందల్ రాయ్ జైలులో బతికున్నాడంటూ వచ్చిన లేఖ

ఇందల్ రాయ్ బతికున్నాడంటూ చౌదరి పంపిన లేఖ

స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే లేదా ఎస్పీ నుంచి ఇందల్ క్యారెక్టర్ సర్టిఫికేట్ తీసుకుని వస్తే.. అతడి విడుదల సాధ్యమవుతుందని కుటుంబ సభ్యులకు చెప్పాడు చౌదరి. ఈ విషయం గురించి ఇందల్ మామయ్య మాట్లాడుతూ.. "లేఖ అందిన వెంటనే ఇందల్​ను విడిపించుకునేందుకు అక్కడికి వెళ్లాము. ఇందల్​ను వెతికేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. దీంతో అతడు చనిపోయాడని అనుకున్నాం. అయితే చాలా ఏళ్ల తర్వాత ఇందల్​ బతికే ఉన్నాడని, క్షేమంగా ఉన్నాడని తెలిసింది. జైలు నుంచి ఇందల్ విడుదల కోసం ఆసక్తితో ఎదురుచూస్తూన్నాము" అని ఆయన అన్నారు.

Last Updated : Feb 4, 2023, 10:13 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.