దేశంలో ఆక్సిజన్ కొరత వేధిస్తోంది. ఆసుపత్రుల్లో ప్రాణవాయువు లేక మృతిచెందుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. బిహార్ పాట్నాలోని నలంద ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరా నిలిచి ముగ్గురు కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు.
సరైన సమయానికి ప్రాణవాయువును అందించడంలో ఆసుపత్రి వర్గాలు విఫలం అయ్యాయని రోగుల బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఆక్సిజన్ కొరత ఉన్నట్లు జిల్లా అధికార యంత్రాంగానికి విజ్ఞప్తి చేసినట్లు వైద్యులు తెలిపారు. మరో 12 మంది రోగులు ప్రాణవాయువు కోసం ఎదురు చూస్తున్నట్లు వివరించారు.
ఈ విషయమై జిల్లా పాలనాధికారి లేఖ రాసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు.
ఇదీ చూడండి: వ్యాక్సినేషన్ 3.0పై కేంద్రం కీలక మార్గదర్శకాలు