ETV Bharat / bharat

దోపిడీకి 30మంది 'బందిపోటు' దొంగలు రెడీ.. పోలీసుల ఎంట్రీతో ఇద్దరు హతం.. మిగతావారు పరార్! - ఉత్తర్​ప్రదేశ్ సంభల్ క్రైమ్ న్యూస్

Bihar Encounter News : బందీపోటు దొంగలు, పోలీసులకు మధ్య జరిగిన ఎన్​కౌంటర్​లో ఇద్దరు దొంగలు మరణించారు. ముగ్గురు పోలీసులు కూడా గాయపడ్డారు. ఈ ఘటన బిహార్​లో జరిగింది. మరోవైపు.. గోవులను అక్రమంగా తరలిస్తున్న స్మగ్లర్లు, పోలీసుల మధ్య జరిగిన కాల్పుల్లో ఓ పోలీసు గాయపడ్డారు. ఈ కేసులో ఆరుగురు స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు.

Bihar Encounter News
Bihar Encounter News
author img

By

Published : Jun 26, 2023, 10:41 AM IST

Updated : Jun 26, 2023, 11:43 AM IST

Bihar Encounter News : బిహార్‌.. తూర్పు చంపారణ్​ జిల్లాలోని మోతిహారీలో బందిపోటు దొంగలకు, పోలీసులకు మధ్య ఎన్‌కౌంటర్‌ జరిగింది. పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు బందిపోటు దొంగలు హతమయ్యారు. ఘోరసహన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పురన్హియా గ్రామ సమీపంలో ఈ ఎన్‌కౌంటర్ ఆదివారం రాత్రి జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు కూడా గాయపడ్డారు.

Shooting Between Police And Robbers : భారీ ఎత్తున దోపిడీకి పాల్పడేందుకు 25 నుంచి 30 మంది బందిపోటు దొంగలు గుమిగూడగా.. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులపై దొంగలు 12 రౌండ్ల కాల్పులు జరిపారు. కొన్ని బాంబులు విసిరారు. పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు దొంగలు హతమయ్యారు. మిగిలిన వారు పరారయ్యారు. ఘటనాస్థలిలో బాంబులు, పిస్టల్‌, గ్యాస్‌ సిలిండర్‌, గ్యాస్‌ కట్టర్‌ వంటివి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గాయపడ్డ పోలీసులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. పారిపోయిన దొంగల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు బందిపోటు దొంగల ఫొటోలను పంపారు. నేపాల్‌ సరిహద్దుల్లో ఈ ఘటన జరిగినందున ఆ దేశ పోలీసులకు కూడా సమాచారం అందించారు.

"తూర్పు చంపారణ్ జిల్లాలోని మోతిహారీలో పోలీసులు, బందిపోటు దొంగలు మధ్య ఆదివారం రాత్రి కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు దొంగలు మరణించగా.. ముగ్గురు పోలీసులు గాయపడ్డారు. గాయాలపాలైన పోలీసులను దగ్గర్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నాం. ఎన్​కౌంటర్​లో హతమైన బందీపోటు దొంగల మృతదేహాలను పోస్టుమార్టం పరీక్ష కోసం ఆస్పత్రికి తరలించాం. బాంబు స్క్వాడ్​, ఫింగర్​ ప్రింట్​ నిపుణులను ఘటనాస్థలికి రప్పించాం."

-- కంతేశ్​ కుమార్ మిశ్రా, మోతిహారీ ఎస్పీ

పోలీసులపై స్మగ్లర్లు కాల్పులు..
Sambhal Encounter : ఉత్తర్​ప్రదేశ్​ సంభల్​ జిల్లాలో పోలీసులకు, గోవులను అక్రమంగా తరలిస్తున్న వారి మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎన్​కౌంటర్​లో ఓ పోలీసు గాయపడ్డారు. ఆరుగురు స్మగ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం ఉదయం జరిగిందీ ఘటన. నిందితుల నుంచి తుపాకీలు, గోవులను తరలిస్తున్న రెండు వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్​కౌంటర్​లో గాయపడిన పోలీసులు, స్మగ్లర్లను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Sambhal Encounter
గోవులను అక్రమంగా తరలిస్తున్న స్మగ్లర్లును అరెస్ట్ చేసిన పోలీసులు

అస్మోలీ పోలీస్‌స్టేషన్‌.. గుమ్సాని గ్రామ సమీపంలో కొందరు గోవులను అక్రమంగా తరలిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. వారిని పోలీసులు వెంబండించారు. నిందితులు లొంగిపోవాలని కోరారు. ఈ క్రమంలో పోలీసులపై.. స్మగ్లర్లు కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు కూడా వారిపై కాల్పులు జరిపారు. దీంతో నిందితులు పోలీసులకు లొంగిపోయారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గోవులను అక్రమంగా తరలిస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Last Updated : Jun 26, 2023, 11:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.