ETV Bharat / bharat

డ్రైవర్​ను వరించిన అదృష్టం.. రాత్రికి రాత్రే రూ.2కోట్ల జాక్​పాట్​

Dream11: ఆన్​లైన్​లో బెట్టింగ్​ పెట్టి రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు ఓ సాధారణ డ్రైవర్. ఐపీఎల్​ సందర్భంగా డ్రీమ్11లో బెట్టింగ్​ పెట్టిన బిహార్​కు చెందిన రమేశ్​ కుమార్​ ఏకంగా రూ.2కోట్లను గెలుచుకున్నాడు.

driver dream 11
driver wins 2 crore in dream11
author img

By

Published : May 7, 2022, 7:37 PM IST

Dream11: ఆన్​లైన్​ బెట్టింగ్ వేదిక డ్రీమ్​11లో రూ.2 కోట్లు గెలిచి రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు బిహార్​కు చెందిన ఓ డ్రైవర్. శారన్​ జిలాల్లోని రసూల్​పుర్​కు చెందిన డ్రైవర్​ రమేశ్​ కుమార్​ను​ ఈ అదృష్టం వరించింది. దీంతో అతడి ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది.

"ఆరంభంలో నేను రూ.49 పెట్టి ఆడేవాడిని. కొన్నిసార్లు గెలిచేవాడిని. మరికొన్ని సార్లు నిరాశే ఎదురయ్యేది. ఇటీవలే పంజాబ్, లఖ్​నవూ మధ్య మ్యాచ్​లో పంజాబ్​ను ఎంచుకున్నా. రూ.59కి కెప్టెన్​గా కగిసో రబాడా, వైస్​ కెప్టెన్​గా శిఖర్​ ధావన్​ను ఎంచుకున్నా."

-రమేశ్ కుమార్, డ్రైవర్

అదృష్టం కొద్దీ ఆ మ్యాచ్​లో రబాడా 3 వికెట్లు తీశాడు. అతడు ఎంపిక చేసుకున్న ఇతర క్రికెటర్లు కూడా బాగా ఆడటం వల్ల దేశ స్థాయిలో అతడికి మంచి పాయింట్లు లభించాయి. మ్యాచ్​ జరిగిన తెల్లారి అతడు నెం.1 స్థానంలో నిలిచి, రూ.2కోట్లు గెలుచుకున్నట్లు అతడికి సందేశం వచ్చింది. జీఎస్​టీ చెల్లింపుల అనంతరం అతడి ఖాతాలో రూ.1.4కోట్లు వచ్చి చేరాయి.

driver dream 11
రమేశ్ కుమార్

రమేశ్​ కుమార్ జీవితాన్ని ఒక్కసారిగా మార్చివేసే సొమ్ము ఇది. అతడి తండ్రి రోజూ కూలీగా పనిచేస్తున్నారు. రాత్రికి రాత్రే కోటీశ్వరుడు కావడాన్ని రమేశ్​ నమ్మలేకపోతున్నారు. ఈ డబ్బుని తన పిల్లల చదువులకు, సమాజ శ్రేయస్సు కోసం వాడతానని అన్నారు.

ఇదీ చూడండి: కట్టుబట్టలతో దేశం దాటిన అభాగ్యుడికి రూ.2కోట్ల లాటరీ.. అయినా బ్యాడ్​ లక్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.