ETV Bharat / bharat

సీఎం హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ - nitish kumar chopper emergency landing

ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్​ను అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. సీఎం రోడ్డు మార్గంలోనే గయ నుంచి పట్నాకు వచ్చారు.

chopper emergency landing
సీఎం హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
author img

By

Published : Aug 19, 2022, 5:13 PM IST

CM helicopter emergency landing : బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్​ను అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. శుక్రవారం ప్రతికూల వాతావరణం దృష్ట్యా గయలో చాపర్​ను దించారు. కాసేపు వేచి చూసినా పరిస్థితి మెరుగుపడకపోవడం వల్ల రోడ్డు మార్గంలోనే గయ నుంచి పట్నాకు వచ్చారు నీతీశ్.

వర్షాభావ ప్రభావంతో బిహార్​లోని అనేక ప్రాంతంలో కరవు తరహా పరిస్థితులు ఏర్పడ్డాయి. ఔరంగాబాద్, జెహానాబాద్, గయ జిల్లాల్లో పరిస్థితుల్ని స్వయంగా పరిశీలించాలని ముఖ్యమంత్రి అనుకున్నారు. శుక్రవారం ఏరియల్ సర్వే చేపట్టారు. అయితే.. ప్రతికూల వాతావరణం కారణంగా నీతీశ్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్​ను గయ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా దించాల్సి వచ్చింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.