డ్రీమ్ 11.. ఓ ఆటో డ్రైవర్ జీవితాన్నే మార్చేసింది. రాత్రికి రాత్రే అతడ్ని కోటీశ్వరుడ్ని చేసింది. 39 రూపాయలు పెట్టుబడి పెడితే.. కోటి రూపాయలు సంపాదించి పెట్టింది. బిహార్‌కు చెందిన నౌషాద్ అన్సారీ అనే వ్యక్తికి ఈ బంఫర్ ఆఫర్ తగిలింది. ఇప్పటి వరకు బ్యాంక్ అకౌంట్ కూడా తెరవని నౌషాద్ అన్సారీకి.. బుధవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్ కారణంగా కోటి రూపాయల రివార్డ్ లభించింది.
జీవితాన్ని మార్చిన పంజాబ్ కింగ్స్ vs రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్..
నౌషాద్ అన్సారీ.. ఒక ఆటో డ్రైవర్. పూర్ణియ జిల్లా దగ్రువా బ్లాక్‌లోని మజ్‌గామా పంచాయతీ పరిధిలో నివాసం ఉంటున్నాడు. బుధవారం జరిగిన పంజాబ్ కింగ్స్ vs రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌కు అతడు టీం సెట్ చేశాడు. ఆ టీం డ్రీమ్ 11 అందరికంటే ఎక్కువ పాయింట్లు సంపాదించింది. దీంతో అతడికి కోటి రూపాయల రివార్డ్ లభించింది.
"2021 నుంచి నేను డ్రీమ్ 11లో టీం సెట్ చేస్తున్నాను. ఇప్పటి వరకు 45 టీంలు సెట్ చేశాను. పంజాబ్ కింగ్స్ vs రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌కు.. 39 రూపాయలతో టీం సెట్ చేశాను. లక్కీగా నాకు కోటి రూపాయల రివార్డ్ వచ్చింది. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆటో నడిపితే రోజుకు కేవలం నాలుగు వందలు మాత్రమే వచ్చేవి. ఒకేసారి ఇన్ని డబ్బులు రావడం.. నాకు ఆశ్చర్యంగా ఉంది."
--నౌషాద్ అన్సారీ, కోటి రూపాయలు గెలుచుకున్న వ్యక్తి
బ్యాంక్ ఖాతాలేని నౌషాద్..
అల్తమస్ నౌషాద్ డాన్ పేరుతో డ్రీమ్11 అకౌంట్‌ను క్రియేట్ చేశాడు నౌషాద్ అన్సారీ. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే నౌషాద్ అన్సారీకి ఇప్పటివరకు బ్యాంక్ అకౌంట్ లేదు. డ్రీమ్ 11లో కోటి గెలిచిన తరువాతే.. అతడు బ్యాంక్ ఖాతాను తెరిచాడు. గురువారం స్థానికంగా బ్యాంక్‌లో.. తన పేరిట ఓ బ్యాంక్ అకౌంట్‌ను ఓపెన్ చేశాడు. డ్రీమ్ 11 వ్యాలెట్‌లో ఉన్న డబ్బును తన ఖాతాకు బదిలీ చేసుకున్నాడు. అన్ని ట్యాక్స్‌లు పోను.. తన ఖాతాలో మొత్తం 70 లక్షల జమ అయ్యాయని నౌషాద్ తెలిపాడు.
నిన్నటి వరకు అతి సామాన్యుడు.. డ్రీమ్11తో ఒక్కసారిగా లైఫ్ టర్న్.. రూ.కోటి జాక్‌పాట్!
పొట్టకూటి కోసం సొంత ప్రాంతాన్ని వదిలి వేరే రాష్ట్రానికి వలస వెళ్లిన ఓ యువకుడిని అదృష్టం వరించింది. దాదాపు ఏడాదిన్నరగా ఎదురు చూస్తున్న అతడి కోరిక ఎట్టకేలకు నెరవేరింది. డ్రీమ్ 11 అనే క్రికెట్ గేమింగ్ యాప్‌తో రాత్రికి రాత్రే లక్షాధికారిగా మారిపోయాడు ఆ యువకుడు. ఇంతకీ ఎవరా వ్యక్తి అనుకుంటున్నారా.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.