బిహార్ పట్నాకు చెందిన ఓ ఆలయ పూజారి.. దుర్గాదేవిని తనదైన శైలిలో ప్రార్థిస్తున్నారు. దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నీటితో నిండిన 21 బిందెలను తన ఛాతిపై ఉంచి పూజలు చేస్తున్నారు.
ప్రజల సుఖ సంతోషాల కోసం..!
పట్నాలోని దర్భంగాకు చెందిన ఆ పూజారి పేరు.. బాబా నాగేశ్వర్. నౌలాఖ దుర్గా మందిరంలో నిత్యం పూజలు చేస్తుంటారు. అలాగే ఏటా జరిగే దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భిన్నంగా దుర్గా దేవిని పూజిస్తుంటారు నాగేశ్వర్. ఇందులో భాగంగా తొమ్మిది రోజులపాటు ఉపవాసం ఉంటమే కాకుండా.. నీటితో నింపిన 21 బిందెలను తన ఛాతిపై ఉంచుకుని పూజలు చేస్తారు. దేశ ప్రజల యోగక్షేమాల కోసం గడిచిన 25 ఏళ్లుగా ఈ విధంగా పూజలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అయితే ఈసారి దేశాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని దేవిని ప్రార్థిస్తున్నట్లు నాగేశ్వర్ తెలిపారు.
"నవరాత్రి ఉత్సవాల సందర్భంగా.. 25 ఏళ్లుగా ఛాతిపై 21 బిందెలను ఉంచి ప్రార్థనలు చేస్తున్నాను. దుర్గాదేవి నాకు ఎంతో శక్తిని ఇస్తుంది. తొమ్మిది రోజులు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా ఉపవాసంతో దేవిని పూజిస్తాను."
- బాబా నాగేశ్వర్, పూజారి
ఈ తల్లిని దర్శించుకోవడానికి బిహార్ నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారని నౌలాఖ దేవాలయ వ్యవస్థాపకుడు విజయ్ యాదవ్ తెలిపారు. ఈసారి, కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని.. ప్రభుత్వం మార్గదర్శకాలను అనుగుణంగా భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గాదేవికి తొమ్మిది రోజుల తొమ్మిది రకాల పూజలు చేయనున్నట్లు తెలిపారు. అయితే ఈసారి నవరాత్రి ఉత్సవాలు ఎనిమిది రోజులు ఉంటాయని.. పంచమి, షష్ఠి ఒకే రోజు ఉంటుందని విజయ్ చెప్పారు.
ఇదీ చూడండి: అద్భుత ప్రతిభ.. అగ్గిపుల్లలతో విమానం