ETV Bharat / bharat

భారత్​ బంద్​కు మిశ్రమ స్పందన! - భారత్​ బంద్​ స్పందన

జీఎస్​టీ, ఇంధన ధరలు, ఈ-వే బిల్లుకు నిరసనగా చేపడుతున్న భారత్​ బంద్​కు మిశ్రమ స్పందన వచ్చే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు పేర్కొన్నాయి. పలు ప్రాంతాల్లో బంద్​కు సంపూర్ణ మద్దతు లభించగా, మిగతా చోట్ల బంద్​ ప్రభావం అంతగా ఉండకపోవచ్చని భావిస్తున్నాయి. అయితే ఈ బంద్​ విజయవంతం అవుతుందని అఖిల భారత వ్యాపారుల సమాఖ్య ధీమా వ్యక్తం చేస్తోంది.

bandh
భారత్​ బంద్​కు మిశ్రమ స్పందన!
author img

By

Published : Feb 26, 2021, 1:30 PM IST

అఖిల భారత వ్యాపారుల సమాఖ్య (సీఏఐటీ) చేపడుతున్న 'భారత్​ వ్యాపార్​ బంద్'​కు మిశ్రమ స్పందన వచ్చే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. ఈ బంద్​ ప్రభావం మార్కెట్లపైన కేవలం పది శాతమే ఉంటుందని అఖిల భారత వ్యాపార మండలి సమాఖ్య అభిప్రాయపడింది. బంద్​పై ముందస్తు సమాచారం లేని కారణంగా తాము ఈ బంద్​లో పాలుపంచుకోవడం లేదని వ్యాపారులు తెలిపారు. ప్రధానంగా ఉత్తర్​ప్రదేశ్​లో ఈ పరిస్థితి నెలకొంది.

bandh
బంగాల్​లో మూతపడిన మార్కెట్లు
bandh
బంగాల్​లో మూతపడిన మార్కెట్లు

విజయంవంతం అవుతుంది..

బంద్​ ప్రభావంపై వ్యాపార వర్గాల్లో మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నా.. సీఏఐటీ మాత్రం దీనిపై ధీమా వ్యక్తం చేస్తోంది. బంద్​ విజయవంతం అవుతుందని పేర్కొంది. మార్చి 1 నుంచి నిరసనలను ఉద్ధృతం చేస్తామని సీఏఐటీ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్​ వెల్లడించారు.

పెట్రో ధరలు, నూతన ఈ-వే బిల్లు, జీఎస్​టీపై నిరసనగా సమాఖ్య శుక్రవారం బంద్​కు పిలుపునిచ్చింది.

ఇదీ చదవండి : 18వేల అడుగుల వైశాల్యంలో భవర్​లాల్​ చిత్రం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.