మెరుగైన, ఎన్క్రిప్టెడ్ వర్షెన్‌ను అందుబాటులోకి తెచ్చింది జూమ్ యాప్. ఈ ఫీచర్లతో వినియోగదారుల వ్యక్తిగత సమాచారం మరింత భద్రంగా ఉంటుందని పేర్కొంది. అందరూ కొత్త వర్షెన్‌ను అప్డేట్ చేసుకోవాలని కోరింది.
మీటింగ్ కోసం ఇచ్చే పాస్‌వర్డ్‌ను కనీసం ఆరు అక్షరాలకు మార్చింది జూమ్. దీనితోపాటు వెబినార్స్, క్లౌడ్ రికార్డింగ్‌లోనూ పలు మార్పులు చేసింది. క్లౌడ్ రికార్డింగ్స్‌ను షేర్ చేయడం, వాటి గడువుకు సంబంధించి అడ్మిన్లకు అధికారాలిచ్చింది. సైబర్ నేరాలపై పోరులో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్టు పేర్కొంది జూమ్.
లాక్డౌన్ కారణంగా చాలామంది ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు ఇంటి నుంచి విధులు నిర్వర్తిస్తూ.. వీడియో సమావేశాలకు 'జూమ్' యాప్‌ను వినియోగిస్తున్నారు. ఫలితంగా యాప్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. అయితే ఈ ప్లాట్‌పాం శ్రేయస్కరం కాదని ఏప్రిల్‌లో కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే జూమ్ యాప్ ఈ కొత్త వర్షెన్‌ను అందుబాటులోకి తెచ్చింది.
ఇదీ చూడండి:- కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు