ETV Bharat / bharat

సరిహద్దు వెంబడి పాక్​ సైన్యం కాల్పులు.. యువకుడు మృతి

author img

By

Published : Apr 30, 2020, 10:28 PM IST

జమ్ముకశ్మీర్ పూంఛ్​ జిల్లాలో పాకిస్థాన్​ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. సరిహద్దు గ్రామాలే లక్ష్యంగా దాడులకు తెగబడింది. ఈ ఘటనలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

Pak shelling in J-K
సరిహద్దులో పాక్​ సైన్యం దాడులు.. యువకుడు మృతి

సరిహద్దులో పాకిస్థాన్​ సైన్యం కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. జమ్ముకశ్మీర్​ పూంఛ్​ జిల్లా నియంత్రణ రేఖ వెంబడి ఉన్న గ్రామాలే లక్ష్యంగా మోర్టార్​ షెల్స్ విసిరింది. చిన్న చిన్న ఆయుధాలతో దాడులకు తెగబడింది. ఈ ఘటనలో 18ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో యువకుడు గాయపడ్డాడు. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు.

పాక్ సైన్యం చర్యకు భారత బలగాలు దీటుగా బదులిచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇవాళ రాత్రి 7గంటల సమయంలో పాక్​ సేనలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు పేర్కొన్నారు.

వరుసగా 24వ రోజు..

సరిహద్దు లక్ష్యంగా పాక్​ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం ఇది వరుసగా 24వ రోజు అని అధికారులు వెల్లడించారు. గత రెండు రోజులుగా పూంఛ్​ జిల్లాలోని ఖస్బా, కిర్ని, షాపూర్, మాన్​కోట్​ సెక్టార్లలో దాడులకు పాల్పడినట్లు చెప్పారు.

పాక్​ చర్యలతో నియంత్రణ రేఖ వెంబడి ఉన్న రాజౌరి, పూంఛ్​, కుప్వారా జిల్లాల్లోని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ ప్రాంతాల్లో ఈ నెలలోనే నలుగురు పౌరులు పాక్​ సైన్యం దాడుల్లో మరణించారు.

ఈ ఏడాది జనవరి 1 నుంచి ఫిబ్రవరి 23వరకు పాకిస్థాన్​ ఏకంగా 646 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు రక్షణ శాఖ మార్చిలో తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.