దేశంలోనే అత్యంత యువ ఐపీఎస్ అధికారిగా ఓ యువకుడు రికార్డు సృష్టించబోతున్నారు. గుజరాత్‌కు చెందిన ఆ యువకుడు 22ఏళ్లకే ఐపీఎస్ అధికారిగా బాధ్యతలు చేపట్టనున్నారు. గుజరాత్‌లోని పాలంపూర్ పట్టణం కనోదర్ గ్రామానికి చెందిన హసన్ సఫిన్.. గతేడాది యూపీఎస్సీ పరీక్షల్లో ఆల్ఇండియా స్థాయిలో 570 ర్యాంకు సాధించారు.
అనంతరం అతడు ఐపీఎస్ అధికారి పోస్టుకు ఎంపికయ్యారు. ఈ క్రమంలో శిక్షణ పూర్తి చేసుకున్న హసన్ డిసెంబర్ 23న జామ్‌నగర్ అదనపు ఎస్పీగా బాధ్యతలు చేపట్టనున్నారు.
ఐఏఎస్ కావాలనుకున్నా కానీ..
తనకు ఐఏఎస్ అధికారి కావాలని లక్ష్యం ఉండేదని.. కానీ అది కుదరకపోవడం వల్ల చివరకు ఐపీఎస్‌గా సేవలు చేసేందుకు నిర్ణయించుకున్నట్లు హసన్ సఫిన్ తెలిపారు. సఫిన్ తల్లి తల్లిదండ్రులు ముస్తఫా హసన్, నసీంభాను ఇద్దరూ ఓ వజ్రాల కంపెనీకి సంబంధించిన చిన్న యూనిట్లో పనిచేస్తుంటారు.
తన విద్యాభ్యాసం కోసం వారు ఎంతో శ్రమించారని.. వారితో పాటు అతడి కల నెరవేరడానికి పలువురు వ్యాపారులు ఆర్థిక సాయం చేసినట్లు హసన్ చెప్పారు.