ETV Bharat / bharat

'అయోధ్య ఉగ్రదాడి కేసు తీర్పును స్వాగతిస్తున్నాం' - conviction

ఉత్తరప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ అయోధ్యపై ఉగ్రదాడి కేసు తీర్పును స్వాగతించారు. 2005లో జరగిన ఈ దాడిలో నలుగురు నిందితులకు జీవిత ఖైదు విధించింది అలహాబాద్​ ప్రత్యేక కోర్టు. మరొకరిని నిర్దోషిగా తేలుస్తూ తీర్పునిచ్చింది.

అయోధ్య ఉగ్రదాడి తీర్పును స్వాగతించిన యోగి
author img

By

Published : Jun 18, 2019, 10:02 PM IST

2005లో జరిగిన అయోధ్య ఉగ్రదాడి ఘటనలో నలుగురు నిందితులను దోషులుగా నిర్ధరిస్తూ అలహాబాద్ ప్రత్యేక కోర్టు నేడు తీర్పునిచ్చింది. ఉత్తరప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కోర్టు తీర్పును స్వాగతించారు.

మరో నిందితుడిని కోర్టు నిర్దోషిగా విడుదల చేసినందున చట్టపరమైన పరిశీలనల అనుగుణంగా చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు. ఈ కేసుపై ప్రభుత్వ నిఘా ఉంటుందని యోగి ప్రకటించారు.

2005 జులై 5న అయోధ్యలో జరిగిన ఈ ఉగ్రదాడిలో ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు సీఆర్పీఎఫ్​ జవాన్లు గాయపడ్డారు.
అనంతరం ఐదుగురు జైషే మహ్మద్​ ఉగ్రవాదులను భద్రతాదళాలు హతమార్చాయి. ఈ దాడి జరిగిన 14 ఏళ్ల తర్వాత నలుగురు నిందితులను దోషులుగా తేల్చిన ప్రత్యేక న్యాయస్థానం వారికి జీవితఖైదు విధించింది. ఒక నిందితుడిని నిర్దోషిగా పేర్కొంది. దోషులందరికీ ప్రత్యేక న్యాయమూర్తి దినేశ్ చంద్ర 2 లక్షల 40 వేల రూపాయల చొప్పున జరిమానా విధించారు

ఇదీ చూడండి : పుల్వామాలో ఉగ్రమూకల మరో ఘాతుకం

Intro:Body:

rt

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.