ETV Bharat / bharat

కుమార సర్కార్​కు రేపే చివరి రోజు: యడ్యూరప్ప - karnataka

కుమారస్వామి ప్రభుత్వానికి రేపే ఆఖరి రోజు అని జోస్యం చెప్పారు ప్రతిపక్షనేత యడ్యూరప్ప. కాంగ్రెస్​-జేడీఎస్​ కూటమికి గుణపాఠం చెప్పేందుకే ముంబయిలో ఉన్నట్లు కర్ణాటక అసంతృప్త ఎమ్మెల్యేలు వీడియో విడుదల చేశారు.

Yeddyurappa, Kumaraswamy
author img

By

Published : Jul 21, 2019, 6:31 PM IST

Updated : Jul 22, 2019, 3:02 AM IST

కుమార సర్కార్​కు రేపే చివరి రోజు: యడ్యూరప్ప

శాసనసభ్యుల రాజీనామాతో కర్ణాటకలో నెలకొన్న రాజకీయ సంక్షోభం రేపు తుది అంకానికి చేరుకుంటుందా లేదా అనే ఉత్కంఠ కొనసాగుతోంది. రెండు రోజుల విరామం తర్వాత శాసనసభ రేపు సమావేశం కానుంది.

ఎవరిబలమెంతో రేపు తేలుతుంది: యడ్యూరప్ప

కుమార స్వామి ప్రభుత్వానికి రేపే చివరి రోజు అని జోస్యం చెప్పారు కర్ణాటక భాజపా అధ్యక్షుడు బీఎస్​ యడ్యూరప్ప. ఎవరి బలమెంతో సోమవారం శాసనసభలో తేలిపోతుందన్నారు. విశ్వాస పరీక్షకు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వానికి స్పష్టం చేశారు.

"రాజీనామా చేసిన 15 మంది ఎమ్మెల్యేలను బలపరీక్షకు రావాలని బలవంతం చేయకూడదని సుప్రీం కోర్టు చెప్పింది. కాంగ్రెస్‌, జేడీఎస్‌ జారీ చేసిన విప్‌లకు విలువ లేదు. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా సీఎం వ్యవహరిస్తున్నారు. స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌, ముఖ్యమంత్రి కుమార స్వామి, సీఎల్పీ నేత సిద్ధరామయ్య రేపటి అవిశ్వాస తీర్మానానికి సిద్ధంగా ఉండాలి. రేపే కుమారస్వామి ప్రభుత్వానికి చివరిరోజు.''
-యడ్యూరప్ప, ప్రతిపక్షనేత

అసంతృప్త ఎమ్మెల్యేల వీడియో..

కర్ణాటక అసంతృప్త ఎమ్మెల్యేలు ఈ రోజు వీడియో విడుదల చేశారు. కాంగ్రెస్​-జేడీఎస్​ కూటమి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకే తాము ముంబయిలో ఉన్నట్లు చెప్పారు. ఎలాంటి ధన ప్రలోభాలకు లోనవ్వలేదని తెలిపారు. పరిస్థితి సద్దుమణిగాక కర్ణాటక వస్తామని వివరణ ఇచ్చారు.

సుప్రీంలో విచారణ జరిగేనా?

గవర్నర్ ఆదేశాల నేపథ్యంలో ఈనెల 17న సుప్రీంకోర్టు తీర్పులోని విప్​ జారీ అంశంపై మరింత స్పష్టత కోరుతూ సీఎం కుమారస్వామి, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు దినేశ్​ గుండూరావు సుప్రీంకోర్టును శుక్రవారం ఆశ్రయించారు. దీనిపై అత్యున్నత న్యాయస్థానం విచారణ జరుపుతుందా లేదా అన్నది రేపు తేలే అవకాశం కనిపిస్తోంది

ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో కాంగ్రెస్, జేడీఎస్, భాజపా సోమవారం అనుసరించాల్సిన వ్యూహాలకు పదును పెడుతున్నాయి.

కాంగ్రెస్​ సీఎల్పీ సమావేశం

కాంగ్రెస్ శాసనసభా పక్షం ఈ రోజు సమావేశం కానుంది. కర్ణాటక కాంగ్రెస్​ వ్యవహారాల బాధ్యుడు​ కేసీ వేణుగోపాల్, సీఎల్పీ నేత సిద్ధరామయ్య నేతృత్వంలో జరిగే ఈ భేటీలో సోమవారం అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు.

భాజపా శాసనసభా పక్షం భేటీ

ఈ రోజు రాత్రి బెంగళూరులోని రామదా హోటల్​​లో భాజపా శాసనసభా పక్షం సమావేశం కానుంది. రేపు అసెంబ్లీలో జరగబోయే పరిణామాలపై చర్చించనున్నారు కాషాయ పార్టీ నేతలు.

లెక్కల చిక్కులు

కర్ణాటక అసెంబ్లీలో మొత్తం శాసనసభ్యుల సంఖ్య 224. అధికారంలో కొనసాగేందుకు ప్రభుత్వానికి కనీసం 113 మంది సభ్యుల బలం అవసరం.

సంక్షోభానికి ముందు కాంగ్రెస్​-జేడీఎస్​ కూటమి బలం 118. భాజపా బలం 105.

కూటమికి చెందిన 16 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. స్వతంత్ర సభ్యులు మరో ఇద్దరు సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారు. భాజపా పక్షాన చేరారు.

16 మంది రాజీనామా లేఖలు సమర్పించినా... సుప్రీంకోర్టును 15 మంది అసంతృప్తులే ఆశ్రయించారు. ఆ 15 మంది రాజీనామాలను స్పీకర్​ బలపరీక్షకు ముందే ఆమోదిస్తే... కర్ణాటక శాసనసభలో సభ్యుల సంఖ్య 209కి తగ్గుతుంది. అప్పుడు.. ప్రభుత్వం కొనసాగేందుకు కనీసం 105 మంది సభ్యుల మద్దతు అవసరం. ఆ సంఖ్యా బలం కుమారస్వామి ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండే అవకాశం లేదు. భాజపాకు మాత్రం 107 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
VATICAN MEDIA - AP CLIENTS ONLY
Vatican City - 21 July 2019
1. Various of crowds gathered outside the Apostolic Palace on St. Peter's Square awaiting the Pope's traditional Sunday address, also known as Angelus Prayer
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Vatican City - 21 July 2019
2. Crowds gathered outside the Apostolic Palace
3. Close of boy taking a picture
VATICAN MEDIA - AP CLIENTS ONLY
Vatican City - 21 July 2019
4. SOUNDBITE (Italian), Pope Francis: ++SOUNDBITE STARTS WITH SHOT OF CROWDS++
"Dear brothers and sisters, fifty years ago yesterday man set foot on the moon, realising an extraordinary dream. May the memory of that great step for humanity ignite the desire to progress together towards even greater goals: more dignity for the weak, more justice among people, more future for our common home."
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Vatican City - 21 July 2019
5. Crowds taking photos
VATICAN MEDIA - AP CLIENTS ONLY
Vatican City - 21 July 2019
6. Pope Francis waving from his window in the Apostolic Palace
7. Various of crowds cheering
STORYLINE
Pope Francis is hoping that the 50th anniversary of the first moon walk inspires efforts to help our "common home" on Earth.
Francis told the public in St. Peter's Square on Sunday, the day after the anniversary of the July 20, 1969, lunar landing, that the feat achieved an "extraordinary dream".
He expressed hope that the memory of "that great step for humanity" would spark the desire for progress on other fronts: "more dignity for the weak, more justice among people, more future for our common home."
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Jul 22, 2019, 3:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.