ETV Bharat / bharat

'మోదీ 2.0 పాలన హింసాత్మకం, నిరాశాజనకం'

మోదీ 2.0 పాలనపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పించింది. మోదీ ఆరేళ్ల పాలన నిరాశాజనకం, హింసాత్మకమని అభివర్ణించింది. మతాల మధ్య, వర్గాల మధ్య చిచ్చురేపారని, లాక్​డౌన్ సమయంలో వలసకూలీలు, రైతుల పట్ల దయారహితంగా వ్యవహరించారని ఆరోపించింది.

Year of disappointment, disastrous management and diabolical pain: Cong on Modi govt anniversary
ఆరేళ్ల మోదీ పాలన హింసాత్మకం, నిరాశామయం
author img

By

Published : May 30, 2020, 3:15 PM IST

Updated : May 30, 2020, 3:21 PM IST

మోదీ సర్కార్​ ఆరేళ్ల పాలన నిరాశామయంగా, దారుణంగా ఉందని కాంగ్రెస్ అభివర్ణించింది. ఎన్​డీఏ 2.0 ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసింది.

"మోదీ ఆరేళ్ల పాలనలో మతతత్వం పెరిగిపోయింది. వర్గాల మధ్య హింసాత్మక ఘర్షణలు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా మోదీ సర్కార్​ వివిధ వర్గాల మధ్య ఉన్న సోదర భావాన్ని నాశనం చేసింది."

- కె.సి.వేణుగోపాల్​, కాంగ్రెస్ నేత

బాధ్యత గల రాజకీయ పార్టీగా

కరోనా సంక్షోభ సమయంలో ఎన్​డీఏ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వేణుగోపాల్ విమర్శించారు. సంక్షోభం సమయంలో కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోందని భాజపా విమర్శించడాన్ని ఆయన తప్పుబట్టారు. ప్రజల కష్టాలను ప్రభుత్వానికి తెలియజేయడం బాధ్యత గల ప్రతిపక్షంగా తమ కర్తవ్యమని ఆయన పేర్కొన్నారు. అదే విధంగా ప్రభుత్వ వైఫల్యాలను తప్పకుండా ఎత్తిచూపుతామని స్పష్టం చేశారు.

లాక్​డౌన్​ సంక్షోభం సమయంలో వలసకూలీలు, రైతుల పట్ల మోదీ సర్కార్ చాలా దయారహితంగా ప్రవర్తిస్తోందని వేణుగోపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

"మోదీ ఆరేళ్ల పాలన చూస్తే వారు ప్రజలతో యుద్ధం చేసినట్లుగా కనిపించింది. మోదీ ప్రభుత్వం ధనికులను అందలం ఎక్కించి, పేదలను మరింత అణగదొక్కింది. "

-రణదీప్ సుర్జేవాలా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి

వర్చువల్ సెషన్ నిర్వహించాలి

కేంద్ర ప్రభుత్వం త్వరలోనే వర్చువల్ పార్లమెంట్​ సెషన్​ నిర్వహించాలని రణదీప్ సుర్జేవాలా డిమాండ్ చేశారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న సమస్యలపై అత్యవసరంగా చర్చించాల్సిన అవసరముందని ఆయన పేర్కొన్నారు. అలాగే వివిధ పార్లమెంటరీ కమిటీల సమావేశాలు కూడా నిర్వహించాలని ఆయన కోరారు.

ఇదీ చూడండి: మీ త్యాగాలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు: షా

Last Updated : May 30, 2020, 3:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.