ఈటీవీ భారత్ చొరవతో శ్రీలంకలో చిక్కుకుపోయిన 11 మంది ఒడిశా వలస కార్మికుల్లో నలుగురు సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. శ్రీలంకలోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేసేందుకు వెళ్లిన వీరందరితోనూ.. అక్కడి యజమాని సాధారణ సమయానికి మించి 15 గంటలు పని చేయించుకుంటున్నాడని బాధితులు వాపోయారు. ఉద్యోగం కల్పించిన వ్యక్తి తమను చిత్రవధకు గురిచేస్తున్నాడంటూ.. ఇటీవలే సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో పోస్టు చేశారు. అదే సమయంలో బాధితులను ఆదుకోవాలని ఈటీవీ భారత్ రాసిన కథనానికి ఒడిశా ప్రభుత్వం స్పందించింది. తమ రాష్ట్ర ప్రజలైన 11 మందిని స్వదేశానికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని శ్రీలంకలోని భారత రాయబార కార్యాలయానికి లేఖ రాసింది.
విషయం తెలుసుకున్న భారత దౌత్యాధికారులు మొత్తం 11 మందిలో నలుగురికి తాత్కాలిక ఎగ్జిట్ వీసా కల్పించి శ్రీలంక నుంచి వచ్చేందుకు విమాన టిక్కెట్లను కల్పించారు. మిగతా వారిని కూడా స్వదేశానికి తిరిగి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.
సొంతూళ్లకు వచ్చిన వారిలో బంపుర్ ఖొర్దా జిల్లాకు చెందిన దేవ్‌రాజ్ నాయక్, ఆశిష్ మహారాణా, పంకజ్ ప్రధాన్‌తో పాటు బాలేసోర్ జిల్లాకు చెందిన కిశాన్ తరై ఉన్నారు. తమను సురక్షితంగా స్వగ్రామాలకు చేరేలా చేసినందుకు ఈటీవీ భారత్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చూడండి : మహిళల టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు ఇదే