ETV Bharat / bharat

చీరలతో ఇద్దరు యువకుల్ని కాపాడిన మహిళలు - Siruvachur village in Perambalur District

ఇద్దరు పురుషులు నీటమునిగి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే నాకెందుకులే అనుకోలేదు ఆ మహిళలు. తక్షణమే అప్రమత్తమై తమ చీరల సాయంతో వారిని కాపాడారు. ఇప్పుడు అందరిచేత శెభాష్​ అనిపించుకుంటున్నారు.

Women save drowning men in river, praised for brave act
ఇద్దరు పురుషుల ప్రాణాలు కాపాడిన ముగ్గురు మహిళలు
author img

By

Published : Aug 10, 2020, 4:03 PM IST

నదిలో మునిగిపోయిన ఇద్దరు పురుషులను చీరల సాయంతో కాపాడి.. అందరి ప్రశంసలు పొందుతున్నారు తమిళనాడుకు చెందిన ముగ్గురు మహిళలు.

ఇదీ జరిగింది?

పెరంబలూర్​ జిల్లా సిరువాచుర్​ ప్రాంతానికి చెందిన రంజిత్​ అనే ఓ శిక్షణా వైద్యుడు తన స్నేహితుడితో కలిసి కొట్టరై మరూతాయార్​ నదికి వెళ్లాడు. ఒడ్డున నిల్చొని నది అందాలను వీక్షిస్తుండగా.. కాలుజారి నీటిలోకి పడిపోయారు. ఇద్దరికీ ఈత రాకపోవడం వల్ల ప్రాణాలు కాపాడుకునేందుకు విశ్వప్రయత్నాలు చేశారు.

అదే నదిలో స్నానం చేసేందుకు వచ్చిన శెంతామిళ్​​సెల్వి, ముత్తమ్మళ్​, ఆనంద వల్లి అనే ముగ్గురు మహిళలు.. ప్రాణాల కోసం పోరాడుతున్న రంజిత్​, అతడి మిత్రుడ్ని చూశారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ధైర్యంగా వారిని కాపాడటానికి ముందుకొచ్చారు. తమ చీరల సాయంతో బయటకు లాగి వారికి ప్రాణం పోశారు.

విషయం తెలుసుకున్న గ్రామస్థులు, జిల్లా పోలీసులు ఆ ముగ్గురు మహిళల్ని మెచ్చుకున్నారు.

ఇదీ చదవండి: పక్షుల కోసం మూడెకరాల్లో జొన్న పంట!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.