మార్కెట్లో నాటుసారా విక్రయానికి అడ్డు చెప్పిన పోలీసులపై ఇద్దరు మహిళలు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. మహిళా కానిస్టేబుల్ను కర్రలతో చితక బాదారు. మహిళా కానిస్టేబుల్ సైతం ప్రతిఘటించడం వల్ల మార్కెట్లో ఉద్రిక్తత తలెత్తింది. ఒడిశా మయూర్భంజ్లోని బిసోయి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.
తొలుత మహిళలను అడ్డుకొనేందుకు కానిస్టేబుల్ ప్రయత్నించినా.. వినిపించుకోకుండా దాడి చేశారు. సంబంధిత వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఘటనకు సంబంధించి ఓ మహిళను అరెస్టు చేశారు.
ఇదీ చదవండి- రేపిస్టుకు కాంగ్రెస్ టికెట్- ప్రశ్నించారని మహిళపై దాడి