ETV Bharat / bharat

'ఆమె'కు అనారోగ్యం.. పురుషులతో పోలిస్తే అధికం..!

పురుషులతో పోలిస్తే.. స్త్రీలు ఎక్కువగా అనారోగ్యం బారినపడుతున్నట్లు కేంద్ర గణాంకాల ఆధ్వర్యంలో జరిగిన ఓ సర్వేలో తెలిసింది. ఈ సర్వే ప్రకారం 30 ఏళ్ల వయస్సులో 8.3 శాతం మహిళలు అనారోగ్యం పాలవుతున్నారు. పురుషులు 6.7 శాతం అనారోగ్యానికి గురవుతున్నట్లు తెలిసింది.

WOMAN
మహిళల్లో ఆరోగ్య సమస్యలు
author img

By

Published : Dec 11, 2019, 8:02 AM IST

కుటుంబభారం మోస్తూ.. ఒకవైపు ఉద్యోగం, మరోవైపు సంసారం రెండింటినీ సమన్వయం చేసుకుంటున్న మహిళ.. తన సొంత ఆరోగ్యాన్ని మాత్రం కాపాడుకోలేకపోతోంది. మగవారి కంటే మగువలే ఎక్కువగా అనారోగ్యం బారిన పడుతున్నారు. మూడు పదుల వయసు దాటకముందే వీరిని సమస్యలు ముప్పిరిగొంటున్నాయి.

పురుషుల కంటే మహిళలు త్వరగా అనారోగ్యం బారిన పడుతున్నారు. 30 ఏళ్ల వయసులో 8.3% మంది మహిళలకు, 6.7% మంది పురుషులకు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఆరోగ్యరంగంపై కేంద్ర గణాంకాలశాఖ ఆధ్వర్యంలో 2017 జులై నుంచి 2018 జూన్‌ వరకు జరిగిన జాతీయస్థాయి 75వ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. జీవనశైలిలో మార్పులవల్ల పట్టణాలు, నగరాల్లో హృద్రోగాలు, ముధుమేహంతో బాధపడేవారు ఎక్కువగా ఉండగా గ్రామీణులు ఇన్‌ఫెక్షన్ల బారిన పడుతున్నారు.

WOMAN
జాతీయ స్థాయిలో వయస్సుల వారీగా అనారోగ్యంబారిన పడినవారి శాతం

అధ్యయనం ఇలా..

ఇన్‌ఫెక్షన్లు (విషజ్వరాలు, కామెర్లు, రక్త విరేచనాలు, ఇతర), హృద్రోగసమస్యలు (రక్తపోటు, గుండెజబ్బులు), ఊపిరితిత్తుల సమస్యలు, మధుమేహం, థైరాయిడ్‌, క్యాన్సర్‌, జీర్ణకోశ వ్యాధులు, మానసిక సమస్యలు, ఇతర అనారోగ్యాలపై దేశవ్యాప్తంగా అధ్యయనం జరిగింది. నిర్దేశిత 15 రోజుల్లో దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని పట్టణాలు, గ్రామాల ప్రజలు ఏయే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారన్న వివరాలు సేకరించారు.

WOMAN
జాతీయస్థాయిలో ఇన్​ఫెక్షన్లు, హృద్రోగాలు, మధుమేహం, ఇతర సమస్యలతో బాధపడేవారి శాతం

ఇదీ చూడండి:పౌరసత్వ సవరణ బిల్లుపై.. అపోహలు.. వాస్తవాలు

Mumbai, Dec 11 (ANI): Bollywood actors Salman Khan, Saiee M Manjrekar and Arbaaz Khan were spotted outside Mehboob Studio for promotion of their upcoming film 'Dabangg 3' in Mumbai. Salman Khan's brother-in-law Aayush Sharma also marked his presence during movie promotion. They posed for the paparazzi before entering the studio. 'Dabangg 3' is the third film of the Dabangg franchise, which stars Sonakshi Sinha opposite Salman Khan. The film is slated to hit the theatres on December 20. Salman was looking dapper in grey tee, while Saiee was dressed in traditional Indian attire.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.