ETV Bharat / bharat

హజ్​యాత్ర సొమ్ముతో అన్నార్తులకు సాయం

author img

By

Published : Apr 6, 2020, 3:05 PM IST

ముస్లింలకు అతి పవిత్రమైనది హజ్​ యాత్ర. తమ జీవితంలో ఒక్కసారైనా ఈ పవిత్ర ప్రదేశాన్ని సందర్శించాలని తమ వంతు పొదుపు చేస్తుంటారు వారు. అలాగే.. ఓ బామ్మ కూడా సుమారు రూ. 5 లక్షలు దాచింది. కరోనా ప్రభావంతో ఆమె ప్రయాణం వాయిదాపడటం వల్ల... ఈ సొమ్ముతో అన్నార్తులను ఆదుకుంటోంది.

Seva Bharati donation
హజ్​యాత్రా సొమ్మును 'సేవాభారతి'కిచ్చిన మానవతామూర్తి

జీవితంలో ఒక్కసారైనా తమ పవిత్ర ప్రదేశం మక్కాను దర్శించాలని కోరుకోని ముస్లింలు ఉండరేమో. హజ్‌యాత్ర కోసం ఎవరికి వీలైనంత వాళ్లు పొదుపు చేస్తుంటారు. జమ్ముకశ్మీర్‌కు చెందిన 87 ఏళ్ల ఖలీదా బేగం కూడా ఈ యాత్ర కోసం రూ.5 లక్షలు పొదుపు చేశారు. ఈ ఏడాది హజ్‌కు వెళ్లడానికి అన్ని ఏర్పాట్లూ చేసుకున్నారు. అయితే లాక్‌డౌన్‌ కారణంగా ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు.

'సేవాభారతి'కి చేయూత..

ఇలాంటి పరిస్థితుల్లో పేదలు, అన్నార్తులను ఆదుకుంటున్న స్థానిక సంస్థ 'సేవా భారతి'కి చేయూతను అందించాలనుకున్నారు ఖలీదా. అందుకోసం హజ్‌ యాత్ర కోసం పొదుపు చేసిన మొత్తాన్ని విరాళంగా ఇచ్చేశారు. 'ప్రార్థించే పెదవుల కన్నా... సాయం చేసే చేతులు మిన్న' అని నిరూపించారు ఈ బామ్మ.

ఇదీ చదవండి: మానవతామూర్తులు... మన నర్సులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.