ETV Bharat / bharat

'వీలుంటే నాకు... లేదంటే ఆమెకు' - స్థానాలు

సిట్టింగ్​ ఎంపీ. మరోమారు టికెట్​ వస్తుందన్న నమ్మకం లేదు. అందుకే... భార్యకైనా దక్కితే చాలని అనుకుంటున్నారు ఒడిశాలోని కొందరు ఎంపీలు. లోక్​సభ సీట్లలో 33% మహిళలకే ఇస్తామన్న బీజేడీ ప్రకటనను ఆసరాగా చేసుకుని... తెరవెనుక ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వీరితోపాటు టికెట్ల కోసం వరుస కడుతున్న మహిళా నేతలతో పార్టీ కార్యాలయం కళకళలాడుతోంది.

ఒడిశాలోని లోక్​సభ స్థానాల్లో 33శాతం మహిళలకే కేటాయించిన బీజేడీ
author img

By

Published : Mar 18, 2019, 5:21 PM IST

Updated : Mar 19, 2019, 7:55 PM IST

ఒడిశాలోని లోక్​సభ స్థానాల్లో 33శాతం మహిళలకే కేటాయించిన బీజేడీ
ఒడిశాలో లోక్​సభ స్థానాల సంఖ్య 21. అందులో 33శాతం... అంటే 7 సీట్లు మహిళలకే ఇవ్వాలని నిర్ణయించింది అధికార బిజూ జనతా దళ్​. ఈ ప్రకటన... ఎంతో మంది మహిళల్లో ఆశలు రేపింది. వారందరినీ టికెట్ల కోసం పార్టీ కార్యాలయానికి వరుస కట్టేలా చేసింది.

లోక్​సభ సీట్లలో మాత్రమే మహిళలకు 33శాతం ఇస్తామని ప్రకటించింది బీజేడీ. శాసనసభ సీట్లలో రిజర్వేషన్​పై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అయినా... అసెంబ్లీ ఎన్నికల్లోనూ అత్యధిక సంఖ్యలో మహిళలను బరిలోకి దించుతుందని భావిస్తున్నారు అంతా. శాసనసభ ఎన్నికల టికెట్​ కోసం తెరవెనుక విస్తృత ప్రయత్నాలు చేస్తున్నారు. మహిళల నుంచి వస్తున్న అనూహ్య స్పందనతో బీజేడీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.

విజ్ఞాపనల పర్వం...

టికెట్లు దక్కవని అనుమానిస్తున్న సిట్టింగ్​ ఎంపీలు... మహిళా రిజర్వేషన్​ను అస్త్రంగా మలుచుకున్నారు. తమకు నిరాకరించినా.. కనీసం తమ భార్యకైనా కేటాయించాలని అధిష్ఠానాన్ని కోరుతున్నారు.

కోరాపుట్​ ఎంపీ ఝినా హికాకా భార్య కౌశల్య, బాలాసోర్​ ఎంపీ రబీంద​ కుమార్​ జెనా​ భార్య సుభాషిణి, కలహండి ఎంపీ అర్కా కేశరీ దేవ్​ భార్య మాలవికా దేవి... టికెట్ల​ కోసం బీజేడీ అధ్యక్షుడిని కలిశారు.

''నాకు రాజకీయాలు కొత్త. పార్టీ నాకు టికెట్​ ఇస్తుందో లేదో తెలియదు. ఒకవేళ నా భర్తకు నిరాశ ఎదురైతే కలహండీ నుంచి నన్ను పోటీకి దించండి.''
- పట్నాయక్​ను కలిసిన అనంతరం మాలవికా దేవి వ్యాఖ్య

''నా భార్య ఉపాధ్యాయురాలు. కానీ.. ప్రజాజీవితంలో నా వెంటే ఉన్నారు. రాజకీయాలను దగ్గర నుంచి చూశారు. పార్టీ ఈ సారి ఆమెకు టికెట్ ఇస్తుందని భావిస్తున్నాను.''
- కోరాపుట్​ ఎంపీ హికాకా

పోంజీ కుంభకోణంలో ఆరోపణల కారణంగా జెనాకు టికెట్​ దక్కకుంటే... ఆయన భార్య సుభాషిణికి అవకాశం కల్పిస్తారని ఊహాగానాలొస్తున్నాయి. సుభాషిణి సోదరుడు ప్రణబ్​ ప్రకాశ్​ దాస్​ ప్రస్తుతం ఎమ్మెల్యే. ఆయన ద్వారానూ ఎంపీ టికెట్​ కోసం ఆమె తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారు.

వారికీ ఇబ్బందే...

మహిళలకు రిజర్వేషన్​పై బీజేడీ నిర్ణయంతో.... ప్రత్యర్థి కాంగ్రెస్​, భాజపాపైనా ఒత్తిడి పెరిగింది.

''లోక్​సభ, శాసనసభ ఎన్నికల్లో ఎక్కువ సంఖ్యలో మహిళా అభ్యర్థుల్ని బరిలోకి దించాలని అధిష్ఠానానికి సూచించాం.''
- నిరంజన్​ పట్నాయక్​, ఒడిశా ప్రదేశ్​ కాంగ్రెస్​ కమిటీ అధ్యక్షుడు

ప్రస్తుతం ఒడిశా తరఫున లోక్​సభలో ముగ్గురు మహిళా సభ్యులు ఉన్నారు. 147 స్థానాలున్న శాసనసభలో మహిళలు 12 మందే.
ఒడిశాకు లోక్​సభతో పాటే... శాసనసభకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇవి నాలుగు దశల్లో ఏప్రిల్​ 11,18, 23, 29 తేదీల్లో జరగనున్నాయి. మే 23న ఫలితాలు ప్రకటించనున్నారు.

SNTV Digital Daily Planning Update, 2030 GMT
Sunday 17th March 2019
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
SOCCER: Highlights from the Bundesliga, Bayern Munich v Mainz. Expect at 2330.
SOCCER: German team wear shirts with anti-fascist message in reply to anti-Semitic abuse targetted at their Israeli captain. Expect at 2330.
SOCCER: Reaction following Betis v Barcelona in La Liga. Expect at 0100.
SOCCER: Reaction following AC Milan vs Inter in Serie A. Expect at 0100.
SOCCER: Guardiola 'prays' his players come back from international break uninjured. Expect at 2300.  
TENNIS: Highlights and reaction from the ATP BNP Paribas Open final in Indian Wells, California - Federer v Thiem. Expect highlights at 0100.
TENNIS: Highlights and reaction from the WTA Indian Wells final in California - Kerber v Andreescu. Expect highlights at 2330.
NFL: NFL players Jamaal Charles and Joe Haden run skills clinic at Special Olympics in UAE. Expect at 2200.
TENNIS: 'Rafa text me to say he couldn't play' - Federer on Nadal injury drop out. Already moved.
TENNIS: Djokovic and Sampras team up against McEnroe in legends exhibition match. Already moved.
SOCCER: Guardiola 'sorry' after FA Cup controversy and downplays quadruple hope. Already moved.
SOCCER: Spain train as preperations for international fixtures begin. Already moved.
VIRAL (SKIING): Olympic champion Frida Hansdotter hands out pastries during farewell run. Already moved.
VIRAL (SOCCER): Iniesta falls over advertising board after assisting Podolski in J-League. Already moved.
********
Here are the provisional prospects for SNTV's output on Monday 18th March 2019
SOCCER: Germany training and press talk in Wolfsburg. Pietro from AP Berlin covering. Expect wrap around 19g. NM OK (od)
SOCCER: Argentina train in Madrid in preparation for friendly international against Venezuela.
SOCCER: Brazil train and talk in Porto as the Selecao get ready to face Panama in friendly fixture.
SOCCER: Former Barcelona and Spain midfielder Xavi Hernandez on a promotional tour in Mumbai, India.
CYCLING: Highlights from Stage 6 of the Tirreno-Adriatico in Italy.
SKIING: SNTV catches up with Mikaela Shiffrin at the end of another hugely successful season.
BIZARRE: Winter sports enthusiasts take to the slopes in swimwear at Sochi's "Boogel Woogel Carnival".
BASEBALL: Post-game reaction after the Oakland Athletics v Hokkaido Nippon Ham Fighters exhibition in Tokyo.
BASEBALL: Post-game reaction after the Seattle Mariners v Yomiuri Giants exhibition in Tokyo.
Last Updated : Mar 19, 2019, 7:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.