ETV Bharat / bharat

'హాథ్రస్'​ ఘటనపై సీజేఐకి మహిళా లాయర్ల లేఖ - letter to CJI on Hathras rape case news

హాథ్రస్​ అత్యాచార ఘటనపై భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు మహిళా న్యాయవాదులు. ఈ ఘటనకు సంబంధించి సాక్ష్యాలను తారుమారు చేయాలని ప్రయత్నించిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.

Women advocates write to CJI on Hathras rape case
హాథ్రస్​ అత్యాచార ఘటనపై సీజేఐ లేఖ
author img

By

Published : Oct 1, 2020, 3:55 PM IST

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తర్​ప్రదేశ్​ హాథ్రస్​ అత్యాచార ఘటనపై.. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు 40 మంది మహిళా న్యాయవాదులు. ఈ ఘటనపై హైకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిగేలా ఆదేశాలు జారీ చేయాలని జస్టిస్​ ఎస్​ఏ బోబ్డేను, కొలీజియం న్యాయమూర్తులను కోరారు. ఘటనకు సంబంధించిన సాక్ష్యాలను తారుమారు చేయాలని ప్రయత్నించిన పోలీసులు, పాలనాధికారులు, వైద్య సిబ్బందిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు.

"అర్ధరాత్రి దహన సంస్కారాలు చేయడం బాధితురాలి కుటుంబానికి, వారి మత విశ్వాసాలకు విరుద్ధం. ముఖ్యంగా ఈ ఘటనలో పోలీసులు వ్యవహరించిన తీరు పరిగణనలోకి తీసుకొని తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది" అని లేఖలో పేర్కొన్నారు. బాధితురాలి కుటుంబం వ్యవస్థపై విశ్వాసాన్ని కోల్పోకుండా తగిన చర్యలు తీసుకొని, వారికి భరోసా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు మహిళా న్యాయవాదులు.

ఇదీ చూడండి: హాథ్రస్​ ఘటనలో ట్విస్ట్- బాధితురాలిపై అత్యాచారం జరగలేదు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.