ETV Bharat / bharat

శవంతో నాలుగు రోజులుగా ఒకే ఇంట్లో..! - ఇంట్లో నుంచి దుర్వాసన

ఓ జ్యోతిష్కుడు ఇంట్లో నుంచి దుర్వాసన వ్యాపిస్తోంది. విషయం ఏంటో కనుక్కుందామని ఆ ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు చుట్టుపక్కల వాళ్లు. తీరా వెళ్లి చూడగా.. వారికో షాకింగ్​ నిజం తెలిసింది. అసలేమైందంటే..

Woman keeps fortune teller dead body for four days
శవంతో నాలుగు రోజులుగా ఒకే ఇంట్లో..!
author img

By

Published : Nov 23, 2020, 8:11 AM IST

శవాన్ని ఇంట్లో ఉంచుకుని నాలుగు రోజుల పాటు సావాసం చేసింది ఓ మహిళ. ఈ ఘటన తమిళనాడులోని చెంగల్​పట్టు జిల్లాలో జరిగింది.

ఏం జరిగింది?

చెంగల్​పట్టు జిల్లా పెరియాపుదుర్​కు చెందిన దామోదరన్..​ జ్యోతిష్కుడుగా పని చేస్తూ పొట్ట నింపుకునేవాడు. ఆరేళ్ల క్రితమే అతడి భార్య మృతి చెందింది. అప్పటినుంచి తన సహాయకురాలైన రాజేశ్వరి అనే మహిళతో అతడు సహజీవనం చేస్తున్నాడు. నాలుగురోజులుగా తమ ఇంటి చుట్టు పక్కన ఉన్న పిల్లలను పిలిచి తమ కోసం ఆహారాన్ని కొనుక్కురావాల్సిందిగా రాజేశ్వరి అడుగుతూ ఉంది. దామోదరన్​ గురించి చుట్టుపక్కల ఇళ్ల వారు అడిగితే..'ఆసుపత్రికి వెళ్లాడు, పట్టణానికి వెళ్లాడు' అని పొంతన లేని సమాధానం చెబుతూ ఉండేది.

అలా బయటపడింది..

అయితే.. దామోదరన్​ ఇంటిలో నుంచి ఆదివారం.. దుర్వాసన వ్యాపించింది. అనుమానంతో ఆ ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు ఇరుగుపొరుగువారు. ఈ క్రమంలో వారిని రాజేశ్వరి అడ్డుకుని, కత్తితో దాడి చేసేందుకు యత్నించింది. కానీ, ఆమెను తప్పించి ఇంట్లోకి వెళ్లి చూడగా అసలు విషయం బయటపడింది. కుళ్లిపోయిన స్థితిలో దామోదరన్​ మృతదేహం కనిపించింది. ఇంటినిండా పురుగులు తిరుగుతున్నాయి. వెంటనే వారు గ్రామాధికారులకు సమాచారం అందించారు.

ఆ ఇంటికి పోలీసులు వచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చూడండి:ఉద్యోగం కోసం.. నాన్నను చంపి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.