మహిళలు ఒకరు లేదా ఇద్దరు పిల్లలకు జన్మనివ్వటం సాధారణం. కొన్ని సార్లు ముగ్గురు జన్మించే అవకాశాలు ఉన్నాయి. కానీ.. ఒకే కాన్పులో నలుగురు పుట్టటం చాలా అరుదుగా జరుగుతుంది. కర్ణాటలోని ఉత్తర కన్నడ జిల్లా.. సిర్సి పట్టణంలో ఓ మహిళ నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది.
కానీ.. జన్మించిన కొద్ది సేపటికే ఒక పాప మృతి చెందింది. ప్రస్తుతం ముగ్గురు (ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి) చిన్నారులు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఇదీ చూడండి: మహిళల లోదుస్తుల దొంగకు గ్రామస్థుల బడితపూజ