ETV Bharat / bharat

ప్రేమ పేరుతో మోసపోయి.. చివరకు మృత్యు ఒడికి - karnataka woman commit suicide

కర్ణాటకలో ప్రేమ పేరుతో మోసపోయిన ఓ యువతి.. ఆత్మహత్యకు పాల్పడింది. చనిపోయే ముందు స్వీయ వీడియో చిత్రీకరించి మనో వేదనతో కన్నీరు పెట్టుకుంది.

Woman commits suicide after recording selfie video
'ప్రేమించానంటే నమ్మేశా.. ఇప్పుడు మోసపోయా అందుకే!'
author img

By

Published : Jun 1, 2020, 7:58 PM IST

Updated : Jun 1, 2020, 8:05 PM IST

బెంగళూరులో ఓ యువతి ప్రేమ కాటుకు బలైపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రేమిస్తున్నానంటూ వచ్చిన ఓ ప్రబుద్ధుడి చేతిలో మోసపోయిన 29ఏళ్ల యువతి.. తీవ్ర మనస్తాపంతో విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. చనిపోయే ముందు వీడియో చిత్రీకరించింది.

చనిపోయిన మహిళ సెల్ఫీ వీడియో

మోసపోయానని..

తవరకేరులోని కృష్ణమూర్తి లే అవుట్​లో మే 28న ఈ ఘటన జరిగింది. చనిపోయిన యువతి, దినేశ్​ అనే వ్యక్తి ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. మాటలతో పాటు మనసులు కలవడం వల్ల ప్రేమలో మునిగిపోయారు. ఆమెను పెళ్లి చేసుకుంటానని ప్రమాణం చేసి.. రూ.5 లక్షలు తీసుకున్నాడు దినేశ్​. అంతే ఏమైపోయాడో తెలియదు. మరుసటి రోజు నుంచి కనిపించకుండా పోయాడు. ఆ తర్వాత తెలిసింది తాను మోసపోయానని. ఏం చేయాలో తెలియక తీవ్ర క్షోభ అనుభవించి చివరికి ప్రాణం వీడింది.

చనిపోయే ముందు తీసిన వీడియోలో తన చావుకు కారణం దినేశ్​ అని చెప్పింది. నిందితుడి​పై పోలీసులు కేసు నమోదు చేసి.. గాలిస్తున్నారు.

ఇదీ చూడండి:- పదవీ విరమణ రోజున కార్యాలయంలోనే డీజీపీ నిద్ర

Last Updated : Jun 1, 2020, 8:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.