దేశంలో లాక్డౌన్ ఆంక్షలు సడలించిన నేపథ్యంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడులపై వైరస్ ప్రభావం అధికంగా ఉంది. దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 2.16 లక్షలకు చేరింది. 6,075 మంది మృతి చెందారు. 1,04106 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.
మహారాష్ట్రలో రికార్డుల మోత..
మహారాష్ట్రలో ఒక్కరోజులోనే 2933 కొత్త కేసులు నమోదయ్యాయి. రికార్డు స్థాయిలో 123 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 77,793కు చేరింది. మరణాలు 2710కి చేరాయి. ఒక్క ముంబయి నగరంలోనే 1442 కొత్త కేసులు నమోదయ్యాయి. 48 మంది మృతి చెందారు.
తమిళనాడులో..
తమిళనాడులో గత 24 గంటల్లో 1,373 కొత్త కేసులు నమోదయ్యాయి. 12 మంది మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసులు 27,256 మరణాలు 220కి చేరాయి. ప్రస్తుతం 12,132 మంది చికిత్స పొందుతున్నారు.
గుజరాత్లో..
గుజరాత్లో కొత్తగా 492 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది 33 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 18,609కి చేరగా మృతుల సంఖ్య 1,155కు చేరింది.
కేరళలో మళ్లీ విజృంభణ..
కేరళలో కరోనా కోరలు విప్పుతోంది. గత 24 గంటల్లో 94 కొత్త కేసులు నమోదయ్యాయి. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల్లో 884 మంది చికిత్స పొందుతున్నట్లు ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు.
కర్ణాటకలో..
కర్ణాటకలో ఈరోజు 257 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 4320, మరణాలు 57కు చేరాయి. ప్రస్తుతం 2651 మంది చికిత్స పొందుతున్నారు.
యూపీలో..
ఉత్తర్‌ప్రదేశ్‌లో గత 24 గంటల వ్యవధిలో కొత్తగా 371 కరోనా కేసులు నమోదయ్యాయి. 15 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 9237గా ఉంది.
బంగాల్లో..
బంగాల్లో ఇవాళ కొత్తగా 368 కరోనా కేసులు బయటపడ్డాయి. 10 మంది మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసులు 6876కు చేరాయి.
ఇదీ చూడండి: ప్రపంచవ్యాప్తంగా 4లక్షలకు చేరువలో కరోనా మరణాలు