ETV Bharat / bharat

ఆ పైలట్​ది యుద్ధ విమానాలు నడిపిన అనుభవం - kerala kozikode flight mishap

ఆయనో యుద్ధ పైలట్... భారత వాయుసేనలో వింగ్ కమాండర్​గా పనిచేశారు. విమానాలు నడపడంలో సుదీర్ఘ అనుభవం ఉంది. జాతీయ డిఫెన్స్​ అకాడమీలో అవార్డులు సైతం గెలుచుకున్నారు. కానీ.. కేరళ కోజికోడ్​లో జరిగిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. ఆయనే కెప్టెన్ దీపక్ సాథే. ప్రమాదానికి గురైన విమానాన్ని నడిపిన పైలట్ ఈయనే.

captain deepak v sathe
ఆ పైలట్​ది యుద్ధ విమానాలు నడిపిన అనుభవం
author img

By

Published : Aug 8, 2020, 5:38 AM IST

కోజికోడ్​లో జరిగిన విమాన ప్రమాదంలో పైలట్ సాథేతో పాటు కోపైలట్ సైతం​ మరణించారు. పైలట్​ను కెప్టెన్ దీపక్ సాథేగా గుర్తించారు అధికారులు. ఎయిరిండియాలో చేరకముందు భారత వాయుసేనలో వింగ్ కమాండర్​గా పనిచేశారు కెప్టెన్ దీపక్ సాథే. అంబాలాలోని 17 స్క్వాడ్రన్​కి చెందిన ఆయన మిగ్​-21 యుద్ధ విమానాలను సైతం నడిపారు.

స్వార్డ్ ఆఫ్ హానర్

జాతీయ డిఫెన్స్ అకాడమీలో దీపక్..​ శిక్షణ పొందినట్లు విశ్రాంత ఎయిర్​మార్షల్ భూషణ్ గోఖలే తెలిపారు. 1981లో సాథేకు స్వార్డ్​ ఆఫ్ హానర్​ లభించినట్లు వెల్లడించారు. సాథే అద్భుతమైన స్క్వాష్ ఆటగాడని గోఖలే గుర్తు చేసుకున్నారు.

"కెప్టెన్ దీపక్ వీ సాథే పుణెలోని జాతీయ డిఫెన్స్ అకాడమీలో 58వ బ్యాచ్​కి చెందినవారు. జూలియట్ స్క్వాడ్రన్​లో సభ్యుడు. 1981లో ఎయిర్​ఫోర్స్ అకాడమీ నుంచి స్వార్డ్ ఆఫ్ హానర్​ను గెలుచుకున్నారు. భారత వాయుసేనలో యుద్ధ పైలట్​గా పనిచేశారు."

-ఎయిర్​మార్షల్(విశ్రాంత) భూషణ్ గోఖలే

తర్వాతి కాలంలో ఎయిర్​ఫోర్స్​ ట్రైనింగ్ అకాడమీలో అధ్యాపకుడిగా పనిచేశారు సాథే. అనంతరం వాయుసేన నుంచి పదవీ విరమణ తీసుకొని ఎయిరిండియాలో చేరారు.

దుర్ఘటన

కేరళ కోజికోడ్​లో జరిగిన విమాన ప్రమాదంలో ఇప్పటివరకు 17 మంది మరణించారు. 120 మందికిపైగా గాయాలయ్యాయి. పలువురి పరిస్థితి విషమంగా ఉంది.

రన్​వేవై దిగుతుండగా ఒక్కసారిగా విమానం అదుపుతప్పి లోయలో పడిపోయింది. దీంతో లోహవిహంగం రెండు ముక్కలైంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.