ETV Bharat / bharat

యూపీలో 'అగ్రవర్ణ' రాజకీయం కాంగ్రెస్​కు కలిసొచ్చేనా?

ఉత్తర్​ప్రదేశ్​లో అధికారంలోకి వచ్చేందుకు అందివచ్చిన అన్ని అవకాశాలను పరిశీలిస్తోంది కాంగ్రెస్. రాష్ట్రంలో పునర్​వైభవం సంపాదించేందుకు కుల రాజకీయాలకు తెరతీసింది. అగ్రవర్ణాన్ని తనవైపు తిప్పుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

author img

By

Published : Jul 11, 2020, 4:40 PM IST

Will Priyanka Gandhi's shift to Lucknow Help congress to revive itself in a long lost bastion?
యూపీలో 'అగ్రవర్ణ' రాజకీయం కాంగ్రెస్​కు కలిసొచ్చేనా?
  • భాజపాకు అండగా ఉండే బ్రాహ్మణ వర్గంలో చీలికలు.
  • ఇతర పార్టీల వైపు చూస్తున్న సమాజ్​వాదీ పార్టీకి మద్దతిచ్చే ముస్లింలు.
  • బహుజన్ సమాజ్ పార్టీపై విశ్వాసం కోల్పోతున్న దళితులు.
  • వీరందరినీ తనవైపు తిప్పుకోవాలని చూస్తున్న కాంగ్రెస్.

సంక్షిప్తంగా చెప్పాలంటే ఉత్తర్​ప్రదేశ్​ రాజకీయాల్లో ప్రస్తుత పరిస్థితులు ఇవే! యూపీ అసెంబ్లీ​ ఎన్నికలకు మరో రెండు సంవత్సరాల సమయం ఉండగా.. ఇప్పటి నుంచే పార్టీని బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ ప్రణాళికలు వేసుకుంటోంది. రాష్ట్రంలో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి కుల రాజకీయ వ్యూహాలకు పదును పెడుతోంది.

1980లో మండల్ కమండల్ ఆందోళనల తర్వాత కాంగ్రెస్ పార్టీ క్రమంగా బలహీనపడిపోయింది. దళితులు, ముస్లింలలో పట్టు కోల్పోయింది. ఈ వర్గాలన్నీ ప్రాంతీయ పార్టీలకు మద్దతివ్వడం వల్ల అప్పటి నుంచి అధికారంలోకి రాకుండా పోయింది.

బ్రాహ్మణులపై దృష్టి..

ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు వేగంగా మార్పు చెందుతుండటం వల్ల మళ్లీ కులసమీకరణాలపై లెక్కలు వేసుకుంటోంది కాంగ్రెస్. రాష్ట్రంలోని దళితులు, ఓబీసీలు, ముస్లింల జనాభా గణాంకాలను నియోజకవర్గాల వారీగా సమీకరించాలని పార్టీ యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు అగ్రవర్ణ ప్రజలను ఆకర్షించుకునేందుకు ప్రణాళికలు వేస్తోంది. ఒకప్పుడు తమకు బలమైన వర్గంగా ఉన్న వారిని తిరిగి తిప్పుకోవాలని భావిస్తోంది. ఈ మేరకు 'బ్రాహ్మిణ్ చేత్నా పరిషత్​'ను ప్రారంభించింది. భాజపా పాలనలో బ్రాహ్మణులపై జరుగుతున్న అకృత్యాలకు వ్యతిరేకంగా గళం వినిపించడానికే దీన్ని స్థాపించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఎన్​'కౌంటర్​' భాజపా!

ఉత్తర్​ప్రదేశ్​లోని తాజా పరిస్థితులు కూడా కాంగ్రెస్​కు అనుకూలంగా ఉన్నట్లు రాజకీయ పండితులు చెబుతున్నారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఎన్​కౌంటర్​ ఉదంతంపై తీవ్రమైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని... బ్రాహ్మణ వర్గానికి చెందిన కొంతమంది ప్రజలు ఈ ఘటనపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్పుకొచ్చారు. దీనిపై సామాజికమాధ్యమాల్లో దుమారం చెలరేగుతోంది.

అంతేకాకుండా ఉత్తర్​ప్రదేశ్​లో అగ్రవర్ణాల మధ్య పోరు నడుస్తోంది. గోరఖ్​నాథ్ మఠం విషయంలో వివాదం నెలకొంది. రాష్ట్రంలోని అన్ని మఠాలు బ్రాహ్మణుల ఆధ్వర్యంలో ఉంటే గోరఖ్​నాథ్​ మాత్రం రాజ్​పుత్, ఠాకూర్​ల ఆధ్వర్యంలో ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ ఈ మఠానికి అధ్యక్షుడిగా ఉన్నారు. దీనిపై బ్రాహ్మణులు అసంతృప్తితో ఉన్నారు.

కాంగ్రెస్​కు లాభం!

యూపీలో కుల రాజకీయాల వల్ల కాంగ్రెస్​కు లాభం చేకూరే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత పరిణామాల్లో బ్రాహ్మణ వర్గం చీలిపోయి కొంతమంది కాంగ్రెస్​కు మద్దతిచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ అగ్రవర్ణ ప్రజల బలమైన ఓటుబ్యాంకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే శక్తినిస్తుందని స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రంలో దాదాపు 14 శాతం ప్రజలు ఈ వర్గానికే చెందినవారని చెబుతున్నారు.

ప్రియాంక రావాలి

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీని యూపీ బరిలోకి దించేందుకు ఇదే సరైన సమయమని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు రాజకీయ పండితులు. ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో ప్రియాంకా గాంధీ కీలకంగా మారారు. యోగి ప్రభుత్వంపై సామాజిక మాధ్యమాల్లో విరుచుకుపడుతున్నారు. భాజపాతో పాటు ప్రధాన ప్రతిపక్షమైన బహుజన్ సమాజ్​ పార్టీలపై ఎప్పటికప్పుడు విమర్శలు ఎక్కుపెడుతున్నారు.

క్షేత్రస్థాయిలో పనిచేస్తేనే..

దిల్లీ​లోని ప్రభుత్వ నివాసాన్ని ఖాళీ చేయాలని ఇటీవల కేంద్రం నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఉత్తర్​ప్రదేశ్​కు ప్రియాంక గాంధీ తన మకాం మార్చనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే రాష్ట్రంలో కీలక నాయకురాలిగా ప్రియాంకను గుర్తించినప్పుడే యూపీలో కాంగ్రెస్​ను పునరుద్ధరించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

"సామాజిక మాధ్యమాల్లో పోరాడటం ద్వారా ప్రభుత్వాన్ని స్థాపించలేం. ప్రియాంకా గాంధీ క్షేత్రస్థాయిలో పనిచేయాలి. ఇతర ప్రాంతాలను సందర్శించాలి. అమేఠీ, రాయ్​బరేలీ నియోజకవర్గాలకే కాంగ్రెస్ దృష్టిసారిస్తోందని ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి."

-యోగేశ్ మిశ్రా, ప్రముఖ జర్నలిస్ట్

సామాజిక మాధ్యమాల్లో ప్రియాంకా గాంధీ చురుకుగా ఉన్నప్పటికీ... సమాజ్​వాదీ, బహుజన్ సమాజ్​, భాజపాలకు కాంగ్రెస్ తగిన పోటీ ఇవ్వలేకపోతోందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

"'మండల్- కమండల్' తర్వాత ఉత్తర్​ప్రదేశ్​లో రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అధికారంలో ఉన్నవారికి వ్యతిరేకంగా వ్యవహరించడంపైనే కాంగ్రెస్ ఆధారపడిపోయింది. కానీ ఇప్పుడు ఆ పార్టీకి అవకాశం దక్కే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ములాయం సింగ్ యాదవ్ చురుకుగా లేరు. అఖిలేష్ యాదవ్.. వారసుడిగా మిగిలిపోయారు. దళితులు, ముస్లింల మద్దతును మాయావతి కోల్పోతున్నారు."

-వెంకటేష్ కేసరి, రాజకీయ విశ్లేషకులు

ఈ లోటుపాట్లను పూడ్చుకోవడానికి ఇటీవలి కాలంలో కాంగ్రెస్​ తీవ్రంగా శ్రమిస్తోంది. పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపే ప్రయత్నం చేస్తోంది. ప్రజలతో తెగిపోయిన సంబంధాలు తిరిగి నెలకొల్పే విధంగా ప్రణాళికలు రచిస్తోంది. శాంతి భద్రతల వైఫల్యం, నేరాలు పెరిగిపోవడం వంటి సమస్యలను ఎత్తిచూపుతూ యోగి సర్కార్​పై విమర్శలు ఎక్కుపెడుతోంది. ఈ నేపథ్యంలో 2022 ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది.

ప్రాంతీయ పార్టీల పట్ల ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లడం పార్టీకీ ఇప్పుడు కలిసొచ్చే అంశమని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2017 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యంత ఘోరమైన పరాభవాన్ని ఎదుర్కొంది. సమాజ్​వాదీతో కలిసి పోటీ చేసినప్పటికీ రాష్ట్రంలో ప్రభావం చూపలేకపోయింది. కేవలం ఏడంటే ఏడు సీట్లకే పరిమితమైంది.

ఇదీ చదవండి- మిషన్​ 2022: సీఎం అభ్యర్థిగా ప్రియాంక గాంధీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.