దేశంలోని పేదలు, అణగారిన వర్గాలకు కరోనా టీకా ఉచితంగా అందిస్తారో లేదో కేంద్రం స్పష్టతనివ్వాలని కాంగ్రెస్ సీనియర్ నేత రణదీప్ సుర్జేవాలా డిమాండ్ చేశారు. తొలి విడత వ్యాక్సినేషన్‌లో 3 కోట్ల మందికి టీకా అందిస్తామని కేంద్రం చెప్పినప్పటికీ.. మిగిలిన ప్రజలకు వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తారో లేదో మాత్రం స్పష్టం చేయలేదని విమర్శించారు.
ఆహార భద్రతా చట్టం కింద 81 కోట్ల మందికిపైగా ప్రజలు లబ్ధిదారులుగా ఉన్నారన్న సుర్జేవాలా.. వారంతా ప్రభుత్వం దృష్టిలో ఉచిత టీకా పొందేందుకు అర్హులు కారా అని ప్రశ్నించారు. ఒకవేళ ప్రభుత్వం వారికి టీకా ఇవ్వాలనుకుంటే.. ఎప్పుడు ఉచితంగా ఇస్తారో చెప్పాలన్నారు. టీకా పంపిణీకి సంబంధించిన ప్రణాళికను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: 'ప్రపంచానికి ఔషధ నిలయంగా భారత్'