చైనాతో సరిహద్దు ఘర్షణలో 20మంది సైనికుల మృతి, మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. ప్రధాని మోదీ లక్ష్యంగా విమర్శలు చేశారు. సరిహద్దుల్లో చైనాతో నెలకొన్న ఉద్రిక్తతలపై ప్రధాని మోదీ మౌనం వీడాలని, తూర్పు లద్దాఖ్‌లో ఏం జరుగుతోందో తెలుసుకోవాల్సిన అవసరం దేశానికి ఉందని, ఎందుకు దాస్తున్నారని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు రాహుల్.
"సరిహద్దు వివాదంపై ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారు? జరిగిందేదో జరిగిపోయింది ఇప్పటికైనా వాస్తవాలు చెప్పండి.
చైనాకు ఎంత ధైర్యముంటే భారత జవాన్లను చంపుతుంది. భారత భూభాగాలను ఆక్రమించేందుకు డ్రాగన్‌కు ఎంత ధైర్యం."
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత
ఇదీ చూడండి: సరిహద్దు ఘర్షణలో 16 మంది చైనా జవాన్లు మృతి