ETV Bharat / bharat

'ఎన్నికలు వచ్చినప్పుడల్లా పాకిస్థాన్ ప్రస్తావన ఎందుకు?'

భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన ట్వీట్​ పై కాంగ్రెస్​ స్పందింంచింది. భారత్​లో ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ పాకిస్థాన్​ను ఎందుకు తెరపైకి తీసుకుని వస్తున్నారని సూటిగా ప్రశ్నించింది.

Why does BJP rake up Pakistan every time elections are held: Cong to Nadda
'పాకిస్థాన్​ను బూచిగా చూపించే రాజకీయాలు మానాలి'
author img

By

Published : Oct 29, 2020, 11:09 PM IST

భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా లక్ష్యంగా కాంగ్రెస్​ తీవ్ర విమర్శలు చేసింది. దేశంలో ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఆ పార్టీ సభ్యులు పాకిస్థాన్​ను ఎందుకు తెరపైకి తీసుకొస్తారని కాంగ్రెస్​ అధికార ప్రతినిధి గౌరవ్​ వల్లభ ప్రశ్నించారు. పాకిస్థాన్​లో జరిగే ఎన్నికల్లో నడ్డా పోటీ చేయాలనుకుంటున్నారేమోనని ఎద్దేవా చేశారు. అందుకే బిహార్​లో ఎన్నికలు​ జరుగుతుంటే పాక్​ టీవీ ఛానెళ్లను చూస్తున్నారని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సైన్యానికి అండగా నిలుస్తూ వచ్చిందని గుర్తు చేశారు. ఇకపై కూడ అలాంటి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. భాజపా నేతలు కేపీకే (కాశ్మీర్​, పాకిస్థాన్​, కబ్రిస్థాన్​) లను అడ్డం పెట్టుకుని చేసిన రాజకీయం ఇకపై చెల్లదన్నారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించి మెరుగైన పాలన, నిరుద్యోగాన్ని రూపుమాపడం, మహిళల రక్షణ వంటిని ప్రాధాన అస్త్రాలుగా వాడుకోవాలని హితవు పలికారు.

ఇదీ చూడండి: 'రాహుల్​... పాక్​ చెబుతోంది, ఇకనైనా నమ్మండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.